Mahesh 25 Movie Story Line Leaked

  • 6 years ago
Mahesh 25 movie based on Farmers, Son and father relation. First schedule will starts soon
#Mahesh25movie

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రానికి అంతా సిద్ధం అవుతోంది. అశ్వినీదత్, దిల్ రాజు కలసి ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ సినిమాని కనీవినీ ఎరుగని విధంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఉన్నాడు. భరత్ అనే నేను చిత్ర విజయం తరువాత మహేష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ చిత్ర కథకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడే లీకులు మొదలైపోయాయి.
ఈ చిత్రం జూన్ 9 నుంచి ప్రారంభం కాబోతోన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
రైతు సమస్యలు, తండ్రి కొడుకుల బంధం అనే స్టోరీ లైన్ తో తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెకండ్ హాఫ్ లో మహేష్ బాబు రైతుగా మారిపోతాడట. ఇటీవల మహేష్ ఈ చిత్రం కోసం గడ్డం కూడా పెంచుతున్నాడు. మహేష్ బాబు లుక్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది.

Recommended