Anupama Parameswaran Interesting Comments On A AA Movie
  • 6 years ago
2 years for Trivikram Srinivas beautiful movie A Aa. This is Anupama debut movie in Telugu
#TrivikramSrinivas
#AAa
#Anupama

ప్రేమమ్ చిత్రంతో మాయచేసిన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో కూడా మాయ చేస్తోంది. క్యూట్ లుక్స్ తో అలరించే అనుపమ తెలుగులో పలు చిత్రాల్లో నటింస్తుంది. అనుపమ నటించిన చిత్రం విజయవంతం అవుతున్నాయి. తెలుగు అనుపమ పరమేశ్వరన్ నటించిన తొలి చిత్రం అ.. ఆ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి అనుపమ తాజగా ఓ ట్వీట్ చేసింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అ..ఆ .. చిత్రాన్ని అందంగా తెరకెక్కించారు. ప్రేక్షకుల ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. నితిన్ హీరోగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంవిడుదలై నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ట్విట్టర్ లో స్పందించింది.
ఈ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన మాటలు ఆద్యంతం అలరిస్తాయి. 'రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది' అని అనుపమ చెప్పిన విపరీతంగా అలరించిన సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ వీడియోని అనుపమ పరమేశ్వరన్ ట్విటర్ లో పోస్ట్ చేసింది.
Recommended