Tej I Love You Press Meet

  • 6 years ago
Watch Tej I Love You TEASER. Starring Sai Dharam Tej, Anupama Parameswaran.Director : Karunakaran, Music : Gopi Sundar, Producer : KS Rama Rao.

సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య జరిగే చిన్న రొమాంటిక్ సీన్‌తో దీన్ని డిజైన్ చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది.
నవతరం ప్రేమికుడిగా సాయిధరమ్‌తేజ్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, ఇప్పటివరకు ఆయన చేయనటువంటి విలక్షణ ప్రేమకథాంశమని, అనుపమ పరమేశ్వరన్ అందంతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంటుంది నిర్మాత వెల్లడించారు.
సినిమాను క్యూట్ అండ్ క‌ల‌ర్‌ఫుల్ ల‌వ్‌స్టోరీగా రూపొందిస్తున్నామని, ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని దర్శకుడు కరుణాకరన్ తెలిపారు. తాను తీసిన తొలిప్రేమ‌, ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాల స్టైల్‌లోనే ఈ సినిమా ఉంటుందని తెలిపారు.

Recommended