BCCI Invites Afghanistan President Ghani For Bengaluru Test

  • 6 years ago
The BCCI has invited Afghanistan's President Ashraf Ghani for the historic one-off Test between India and Afghanistan.
#bcci
#afghanistan
#ashrafghani
#teamindia

అఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ బెంగళూరు వేదికగా జూన్‌ 14న ఆరంభం కానుంది. ఈ విషయంపై వివరణ ఇస్తూ.. కాబూల్‌లో బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరీతో కూడిన అధికార బృందం అఫ్గానిస్థాన్‌తో భవిష్యత్‌ పర్యటనల గురించి అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ అతిఫ్‌ మాషాల్‌ చర్చించినట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే బీసీసీఐ బృందం ఆ దేశ‌ అధ్యక్షుడిని కూడా కలిసినట్లు తెలిసింది. 'ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఈ చారిత్రాత్మక టెస్ట్‌ మ్యాచ్‌ ఎంతగానో దోహదపడుతుందని.. ఈ క్రమంలోనే అధ్యక్షుడిని కూడా ఆహ్వానించినట్లు' సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.

Recommended