IRCTC Will Tell Your Ticket Stands A Chance Of Being Confirmed

  • 6 years ago
Passengers may not get confirmed berths each time they book a train ticket, but now, thanks to a predictive service on the IRCTC website, they will get to know their chances of getting one, officials said today.
#news
#technology
#irctc

నిత్యమూ కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో వెయిటింగ్ లిస్టు జాబితా చాంతాడంత ఉంటుందన్న సంగతి విదితమే. టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదోనన్న టెన్షన్ ప్రయాణికులను కలవర పెడుతుంది. అయితే, అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకున్న ఆన్ లైన్ రైల్వే టికెటింగ్ సేవల సంస్థ ఐఆర్సీటీసీ, ఇకపై బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చెబుతుంటుంది.ఇప్పటివరకు కొన్ని ప్రవేట్ సంస్థలు మాత్రమే విశ్లేషించి సమాచారం ఇస్తుండగా.. ఇప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనూ ఈ సౌకర్యం లభిస్తోంది.
టికెట్ల బుకింగ్, రద్దుకు సంబంధించి 13 ఏళ్ల సమాచారం సేకరించి, వాటి ఆధారంగా బెర్త్ ఖరారయ్యే అవకాశాన్ని నిర్ణయించేలా టెక్నాలజీని రూపొందించింది. ఈ వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్‌ఐఎస్) అభివృద్ధి చేసింది.
గతంలో వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ ప్రయాణికులకు చివరి నిమిషం వరకూ బెర్త్ కన్ఫర్మేషన్‌పై గందరగోళం ఉండేది. ప్రస్తుతం ప్రతి రోజు బుకింగ్ తీరును బట్టి బెర్త్ దొరుకుతుందా? లేదా? అని విషయం వెంటనే తెలిసిపోతుంది.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్‌ అవుతున్నాయి. తనకు బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయన్న విషయాన్ని, పీఎన్ఆర్ నంబర్ ఆధారంగా వెబ్ సైట్ వెల్లడిస్తుంది.

Recommended