Bigg Boss Telugu Season 2 Participants Names
  • 6 years ago
Bigg Boss Telugu Season 2 reality show will be launched on 10th June and 16 contestants are going to be locked in a house for 100 days.The name of Sri Reddy is also there, recently the controversial actress made sensational comments of Nani.


బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్ జూన్ 10 నుండి ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించినన సంగతి తెలిసిందే. హీరో నాని హోస్ట్ చేస్తున్న ఈ షో 100 రోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో ఆసక్తికరంగా సాగనుంది. అయితే ఇందులో పాల్గొనబోయే 16 మంది సెలబ్రిటీలు ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. కంటెస్టెంట్స్ వివరాలు ముందే వెల్లడించకుండా షో ప్రారంభం అయ్యే రోజు వరకు సస్పెన్స్‌గానే ఉంచాలని షో నిర్వాహకులు నిర్ణయించారు. కానీ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోరి వచ్చాయి. ఈ లిస్టులో శ్రీరెడ్డి పేరు వినిపించడంపై అంతా షాక్ అవుతున్నారు.
కాస్టింగ్ కౌచ్ అంశంతో వార్తల్లోకి ఎక్కిన శ్రీరెడ్డి పేరు కూడా బిగ్ బాస్ సీజన్ 2 విషయంలో హాట్ టాపిక్ అయింది. హీరో నాని మీద శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి బిగ్ బాస్ ఇంట్లో అవకాశం ఉండక పోవచ్చని భావిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనే కంటెస్టెంట్స్‌లో హీరోయిన్ చార్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన చార్మి తర్వాత అవకాశాలు తగ్గి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె సహ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. ఇటీవల నిర్మించిన ‘మోహబూబా' కూడా నష్టాలనే మిగిల్చింది.
తన హస్కీ వాయిస్‌తో తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ గీతా మాధురి...... బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో పాల్గొనబోతోంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్యామల ఒకరు. బిగ్ బాస్ 2 సెకండ్ సీజన్ కంటెస్టెంట్ల లిస్టులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Recommended