Rajini & Vijay Fans Argue Regarding Kaala Scenes

  • 6 years ago
A section of Vijay fans has taken potshots at Rajinikanth's Kaala, stating that a scene in the upcoming film is inspired by Mersal.

హీరోలు హీరోలు బాగానే ఉంటారు, అభిమానులే అనవసరమైన బేషజాలకు పోయి గొడవలు పెట్టుకుంటారు. ఒకప్పుడు తెలుగులో ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. హీరోలు ఈ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుని అభిమానుల మధ్య ఎలాంటి విబేధాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే తమిళనాడులో ఇలాంటి పరిస్థితులు ఇంకా దర్శనమిస్తూనే ఉన్నాయి. తాజాగా 'కాలా' ట్రైలర్ విడుదల తర్వాత రజనీకాంత్ అభిమానులు, విజయ్ అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది.
కాలా' ట్రైలర్లో కొన్ని సీన్లు చూసిన విజయ్ అభిమానులు.... ఇందులోని కొన్ని షాట్లు ‘మెర్సల్' మూవీ నుండి కాపీ కొట్టి తీశారంటూ గొడవకు తెరలేపారు. రజనీకాంత్ అభిమానులు కూడా ఏ మాత్రం తగ్గకుండాకౌంటర్ ఇవ్వడంతో ఈ ఫైట్ మరింత ముదిరింది.
కాలా' ట్రైలర్లో రజనీకాంత్ హోలీ ఆడుతున్న సీన్ ఉంది. అయితే మెర్సల్‌లో ఇలాంటి సీన్ ఆల్రెడీ చేశారని, ఫ్రేమ్‌లో కూడా ఏమాత్రం తేడా లేకుండా ఈ సీన్ కాపీ కొట్టారని విజయ్ అభిమానులు నానా రచ్చ మొదలు పెట్టారు.
అయితే రజనీకాంత్ అభిమానులు ఏమాత్రం దగ్గకుండా కౌంటర్స్ ఇస్తున్నారు. రజనీ స్థాయికి విజయ్ ఏ మాత్రం సరిపోడని, సూపర్ స్టార్ స్టైల్ ముందు, రెపుటేషన్ ముందు విజయ్ ఎందుకూ పనికి రాడంటూ వారి విమర్శలను తిప్పి కొడుతున్నారు.

Recommended