IPL 2018 : Karn Sharma Won Back To Back 3 IPL Titles
  • 6 years ago
The all-rounder Karn Sharma first played for Railways in a Ranji Trophy for the Best Under-25 cricketer after taking 21 wickets at 19.04 in three Ranji games in 2012.He though has had two good years in Indian T20 League winning two titles in IPL 2018.
#ipl2018
#karnsharma
#chennaisuperkings
#sunrisershyderabad

హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.
రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవడంతో ఆ జట్టులోని ఆటగాడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా కర్ణ్‌ శర్మ నిలిచాడు. 2016, 2017, 2018లో విజేతగా నిలిచిన జట్ల తరుపున కర్ణ్‌ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.
2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కర్ణ్ శర్మ ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన శర్మకు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.
ఆ తదుపరి ఏడాది సన్‌రైజర్స్‌ కర్ణ్‌ శర్మను వేలానికి వదిలేసింది. దీంతో 2017 ఐపీఎల్‌ కోసం నిర్వహించిన వేలంలో కర్ణ్ శర్మను రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ముంబై తరఫున 9 మ్యాచ్‌లాడిన శర్మ 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పూణెతో జరిగిన ఫైనల్లో ముంబై విజయం సాధించి మూడోసారి టైటిల్‌‌ని కైవసం చేసుకుంది. పూణెతో జరిగిన ఫైనల్లో కర్ణ్ శర్మ 18 పరుగులు ఇచ్చాడు.
Recommended