ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

  • 6 years ago
On the eve of NTR’s birth anniversary, makers of the legendary actor-politician’s biopic made an important announcement. Krish Jagarlamudi will be directing the film. The announcement was made through a video, voiced by Balakrishna himself as he hoped to get his father’s blessing for the project.
నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ అనుకోని కారణాలతో తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు బ్రేక్ పడింది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను తాను అనుకున్న విధంగా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బాలయ్య తన వందో చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి పేరు వెల్లడించారు.
జనని భారతి మెచ్చ... జగతి హారతులెత్త... జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..రణభేరి మ్రోగించె తెలుగోడు..జయగీతి నినదించె మొనగాడు..‘‘యన్. టి. ఆర్'' అని పేర్కొన్న బాలయ్య ఆ నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు, నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము.. అని వెల్లడించారు.
చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది..ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది..ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి', ఈ చరిత్రకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను.... అని బాలయ్య తెలిపారు.
ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం... ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం..నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది... అని బాలయ్య తెలిపారు.

Recommended