AB de Villiers Still Has A Lot Of Cricket Left In Him: Mohammed Siraj
  • 6 years ago
AB De Villiers shook the cricketing universe yesterday with his decision to retire from international cricket. The call seemed unbelievable because the 34-year-old has been in some sensational form in the past few months.
#devilliers
#mohammedsiraj
#IPL2018
#royalchallengersbangalore

అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్ వీడ్కోలు చెప్పగానే క్రికెట్ ప్రముఖులతో పాటు సగటు అభిమాని సైతం అతని ఘనతను నెమరువేసుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన డివిలియర్స్ చివరి మ్యాచ్ వరకూ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో అతని జట్టు ఆటగాడైన మొహమ్మద్ సిరాజ్ డివిలియర్స్ గొప్పదనాన్ని పొగిడేస్తున్నాడు.
ఏబీ డివిలియర్స్ రిటైర్‌మెంట్ ప్రకటించగానే షాక్‌కు గురైనట్లు తెలిపాడు. ఇంకా మాట్లాడుతూ.. డివిలియర్స్‌లో ఇంకా చాలా ఆట దాగుందని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఆర్‌సీబీ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. 480 పరుగులు చేసిన అతని ఖాతాలో.. 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పైగా ఆర్‌సీబీ నిర్వహించిన క్యాంపులో ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లలో అతనొకడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరు జట్టు మంచి ఫిట్‌నెస్ ఉన్న ఆటగాళ్లలో డివిలియర్స్ ప్రముఖుడు. బుధవారం మధ్యాహ్నం అతని రిటైర్‌మెంట్ వార్త వినగానే ఆశ్చర్యానికి గురైయ్యాను. అతని ఆటతీరు, ప్రదర్శన ఖచ్చితత్వంతో కూడుకుని ఉంటాయి, అతను అంతర్జాతీయ క్రికెట్‌కు ఆడడం లేదనే మింగుడు పడటం లేదు. ఇంకా చాలా ఆటను అతనిలోనే ఉంచుకుని రిటైర్‌మెంట్‌కు సిద్ధమైపోయాడు.
Recommended