Indian Players Should Play Other Leagues Too: Chris Gayle
  • 6 years ago
Chris Gayle believes in speaking his mind. The Caribbean cricketer didn’t mince words on Tuesday either, even when he was asked about a subject, frequently passed unanswered by many big names.
#kxip
#ipl2018
#india
#chrisgayle
#kingselevenpunjab

భారత క్రికెటర్లు ఎంతో ప్రతిభావంతులని అని కొనియాడాడు క్రిస్ గేల్. ఇంతటి టాలెంట్ ఉన్న క్రీడాకారులు విదేశీ లీగ్‌లలో కూడా ఆడితే చూడాలనుందని వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన గేల్ సీజన్ ఆరంభంలో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. 11 మ్యాచుల్లో 368 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ (104 నాటౌట్) కూడా ఉంది. లీగ్ మొదట్లో భారీ షాట్లతో విరుచుకుపడిన గేల్.. ఆ తరవాత ఫామ్‌ను కోల్పోయాడు.
ఈ ప్రభావం జట్టుపై కూడా పడింది. కారణాలేమైనా పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. ఇక తర్వాత భారత్‌ను విడిచి వెళ్లడానికి ముందు క్రిస్ గేల్.. పూణెలోని 'బ్లేడ్ ఆఫ్ గ్లోరీ క్రికెట్ మ్యూజియం'ను సందర్శించాడు. ఈ సందర్భంగా అక్కడి మహిళా క్రికెటర్లకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అనంతరం మీడియాతో ముచ్చటించాడు.
ఎంతో యువ క్రికెటర్లకు ఐపీఎల్ లాంచింగ్ ప్యాడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు. ఎంతో మంది క్రికెట్లను ఐపీఎల్ ఇంటర్నేషనల్ స్టార్లను చేసిందన్నాడు. భారత క్రికెటర్లు ఇతర టీ20 లీగుల్లో పాల్గొనడానికి అనుమతి ఇస్తే ఇంకా బాగుంటుందని గేల్ అభిప్రాయపడ్డాడు.
‘ఇండియాలో ఎంతో మంది క్రికెటర్లున్నారు. వాళ్లలో ప్రతిభావంతులైన చాలా మందికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం దొరకడంలేదు. ఇలాంటి వాళ్లు ఇతర లీగుల్లో ఆడితే అది చూసి నేను చాలా సంతోషిస్తాను. కొంత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లకు జాతీయ జట్టులో ఆడే అవకాశం రాదు. ఇండియా జట్టులో స్థానం సంపాదించడం ఎప్పుడూ కష్టమే. కాబట్టి అలాంటి వాళ్లకు ఇతర లీగుల్లో ఆడే అవకాశం ఇస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అనుభవం వాళ్లకు దక్కుతంది' అని గేల్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.
Recommended