IPL 2018 : The Players Who Haven't Lived Up To Their Price Tags

  • 6 years ago
The IPL is the most competitive and popular T20 league in the cricket world. The IPL auction marks the beginning of each IPL season and it adds a unique flavour to all the drama. Each auction brings with it a lot of surprises as we see a few players going for a higher sum than others.
#IPL2018
#Cricket
#JosButler
#RohitSharma
#BenStokes
#GlennMaxwell
#Kohli
#RishabhPant

పరుగుల వరద పారిస్తారనే నమ్మకంతో ఆటగాళ్లను లక్షలు పోసి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి. ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్‌ కప్‌ కోసం ఆటగాళ్ల గత రికార్డులన్నీ తిరగేసి ఒక అభిప్రాయానికి వస్తాయి. కొన్ని సార్లు జట్లు అంచనాలు నిజమైనా.. దండగ ఖర్చు అనుకునే సందర్భాలు లేకపోలేదు. ఈ సీజన్ నుంచి ఇప్పటికీ 4 జట్లు నిష్క్రమించడంతో ఆయా జట్లలోని ఆటగాళ్లు ప్రదర్శన ఎలా ఉంది. ఆటగాళ్లకు పెట్టిన ఖర్చు ఎంతవరకూ ఉపయోగపడింది.. అనే విశ్లేషణను ఓ సారి గమనిస్తే..
రోహిత్‌ శర్మ.. 5.24 లక్షలు
హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ జట్టుకే బలహీనంగా తయారైయ్యాడు. ఒకటి అర మ్యాచ్‌లు మినహాయించి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ జట్టును కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేర్చలేకపోయాడు. 14 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 286 పరుగులు మాత్రమే చేసిన రోహిత్‌ అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. దీంతో 15 కోట్ల రూపాయలకు రోహిత్‌ను రీటేన్‌ చేసుకున్న ముంబై జట్టు ఒక్కో పరుగుకు 5.24 లక్షల రూపాయలను చెల్లించుకుంది.
బెన్‌స్టోక్స్‌.. 6.37 లక్షలు
రాజస్థాన్‌ జట్టులో అత్యధిక ధర కలిగిన ఆటగాడు బెన్ స్టోక్స్. 2017 ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక ధర(14. 50 కోట్లు)కు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌. రైజింగ్‌ పూణె సూపర్‌ జెయింట్‌ ఫ్రాంచైజీ తొలగింపుతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ సారి 12.5 కోట్లు వెచ్చించి మరీ స్టోక్స్‌ను కొనుగోలు చేసింది. అయితే 13 మ్యాచ్‌లు ఆడిన స్టోక్స్‌ కేవలం 196 పరుగులు చేసి, 8 వికెట్లు మాత్రమే తీశాడు. అంటే ఒక్కో పరుగుకు 6.37 లక్షలు, ఒక్కో వికెట్‌కు 1.56 కోట్ల రూపాయలు చెల్లించినట్లయింది. ఏదైతేనేమి స్టోక్స్‌ అంతగా రాణించకపోయినప్పటికీ ఆర్‌ఆర్‌ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.

Recommended