'I Paid The Ultimate Price': Says David Warner's Wife

  • 6 years ago
Candice Warner has revealed she had a miscarriage shortly after the “ordeal” of the ball-tampering scandal that engulfed her family in March.
In an interview with Australian Woman’s Weekly, Mrs Warner said the stress and taunting she received after the incident led to her miscarriage.
#davidwarner
#cricket
#australia
#stevesmith
#Balltampering

బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేదానికి గురైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంట మరోసారి విషాదం అలముకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్‌ టెస్టులో డికాక్‌తో గొడవ పడిన వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తన సతీమణి క్యాండిస్‌ను అవమానకరంగా తిట్టినందుకే ఇలా చేసినట్టు అతడు తర్వాత వివరణ ఇచ్చాడు.
దీంతో ఈ ఘటనను అవమానకరంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం వెంటనే వార్నర్‌, స్మిత్‌, బాన్ క్రాఫ్ట్‌ను తిరిగి స్వదేశానికి పిలిపించింది. ఈ ఘటనపై సతీసమేతంగా మీడియా సమావేశంలో పాల్గొన్న వార్నర్‌లు తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. ఈ ఘటనతో వారిపైనే కాకుండా అప్పటికే గర్భీణిగా ఉన్న వార్నర్ భార్య కడుపులో పడిన శిశువుపై కూడా పడింది. కుంగుబాటు, అలసట, అవమానానికి గురైన ఆమెకు చివరికి గర్భస్రావం జరిగింది. వార్నర్‌ కుటుంబాన్ని అంతులేని విషాదంలో నింపేసింది.
వార్నర్ భార్య.. క్యాండిస్‌ ఓ వారపత్రికకు ఇచ్చిన ముఖాముఖి ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తాజాగా తెలిసింది. 'దీని (గర్భస్రావం) వెనక భయానక కారణాలు ఉన్నాయి. కేప్‌టౌన్‌ అంటే మాకెంతో ప్రేమ. 2014లో డేవ్‌ నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పిందీ ఇక్కడే. టెస్టు సిరీస్‌ కోసం మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను గర్భవతినని తెలిసింది. నా శరీరంలో మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్నారి వార్నర్‌ వస్తున్నాడని తెలిసి మేమెంతో సంతోషించాం. చాన్నాళ్ల నుంచి మేం మరొకర్ని కనేందుకు ప్రయత్నిస్తున్నాం. కేప్‌టౌన్‌ చేరిన వెంటనే పరీక్ష చేయించుకున్నా' అని క్యాండిస్‌ తెలిపారు.

Recommended