IPL 2018: KKR VS RR Eliminator Match Preview

  • 6 years ago
The Kolkata Knight Riders and Rajasthan Royals will come up against each other in the Eliminator – the second of the VIVO IPL 2018 Playoff matches.
#ipl2018
#eliminator
#kolkataknightriders
#rajasthanroyals

ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రెండుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఈ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
ఎందుకంటే ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌పై కోల్‌కతానే విజయం సాధించింది కాబట్టి. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సమతౌల్యంగా ఉంది. లీగ్ దశలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించన కోల్‌కతా ఎటువంటి సమీకరణలకు తావులేకుండా ఫ్లేఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ప్లేఆఫ్స్‌కు చేరిన మిగతా 3 జట్లకు లేని అదనపు బలం (సొంతగడ్డపై ఆడనుండటం) కోల్‌కతాకు బాగా కలిసి రానుంది. క్వాలిఫయర్‌-2 కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌‌లో ఓటమిపాలైన సన్‌రైజర్స్‌ జట్టుతో ఇదే వేదికగా తలపడాల్సి ఉంటుంది.
ఈ సీజన్‌లో దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్‌గా నైట్‌రైడర్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో 54.78 సగటుతో 438 పరుగులు చేసి కోల్‌కతా జట్టు తరుపున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నరైన్‌ ఆల్‌రౌండర్‌ పాత్రలో ఇరగదీస్తున్నాడు. ఇక, ఓపెనింగ్‌లో నరైన్, క్రిస్ లిన్‌ ఆ జట్టుకు చక్కటి శుభారంభాలను ఇస్తున్నారు. మిడిలార్డర్‌లో ఆండ్రూ రసెల్‌ విజృంభణ జట్టుకు అదనపు బలం.
ఆరంభ మ్యాచ్‌ల్లో రసెల్ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇక, రాబిన్‌ ఉతప్ప, నితీశ్‌ రాణా, శుబ్‌మన్‌ గిల్‌లు జట్టును భారీస్కోరు దిశగా తీసుకెళ్లరు. బౌలింగ్‌లో సియర్లెస్, ప్రసిధ్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగే సమర్ధులు

Recommended