IPL 2018: Dwayne Bravo Takes A Blinder Off His Own Ball
  • 6 years ago
Chennai Super Kings all-rounder Dwayne Bravo proved why he's one of the best fielders of his own bowling as he took a stunning follow-through catch and dismissed Yusuf Pathan for 24 in the first qualifier game of the Indian Premier League (IPL) 2018 here on Tuesday (May 22).
#chennaisuperkings
#ipl2018
#cricket
#dwaynebravo
#yusufpathan

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఎప్పుడు క్యాచ్ అందుకున్నా తన 'డీజే బ్రావో' స్టెప్ వేస్తూ ఉంటాడు. క్యాచ్ పట్టిన వెంటనే ప్రేక్షకుల వైపు తిరిగి డ్యాన్స్ చేస్తాడు. అయితే మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్రేవో పట్టిన క్యాచ్ చూస్తే ఎవరికైనా అతనితో పాటు సంబరాలు చేసుకోవాలనిపిస్తుంది.
డ్వేన్ బ్రావో వేసిన 15 ఓవర్‌లో ఐదో బంతిని యూసఫ్ పఠాన్ బౌండరీకి తరలించాడు. ఇక ఆఖరి బంతిని కూడా స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. అయితే పిచ్‌కు చాలా తక్కువ ఎత్తులో వేగంగా దూసుకొచ్చిన ఆ బంతిని బ్రావో అద్భుతంగా అందుకున్నాడు. భూమికి జానెడు ఎత్తులో వచ్చిన బంతిని ఒంటిచేత్తో అందుకుని గుండ్రంగా తిరిగుతూ పిచ్‌పై పడిపోయాడు. వెంటనే పైకిలేచి 'డీజే బ్రావో' అంటూ తన మార్క్ స్టెప్‌తో సంబరాలు చేసుకున్నాడు.
అప్పటికే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను యూసఫ్ పఠాన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 29 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీనిలో మూడు ఫోర్లు కూడా ఉన్నాయి. పఠాన్ ఔట్ కావడంతో 88 పరుగులకే హైదరాబాద్ 6 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే మరో కరేబియన్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ 29 బంతుల్లో (43) చెలరేగి ఆడటంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేయగలిగింది.
Recommended