Hero Prabhas Talks To Dubai Media On 'Saaho'

  • 6 years ago
Hero Prabhas Talks To Dubai Media On 'Saaho' .Prabhas offered an exclusive interview to Abu Dhabi Media recently. He shared few interesting details about his upcoming flick 'Saaho'. This was Prabhas' first visit to the capital and he enjoyed shooting for the action thriller in the city. "People are very nice, the mosque is so beautiful, I really enjoyed going to the museum in my free time. Every time we come here for a recce, we bump into a new place. The Abu Dhabi team stopped the traffic for us, they gave us the best roads and the best buildings and we are very grateful for that. We will definitely come again." He also said that it was not that difficult to shoot during Ramadan even though the team was a bit afraid initially.
#Saaho
#Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజులుగా దుబాయ్‌లో 'సాహో' షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా దాదాపు 250 మంది చిత్ర బృందం సినిమాకు పని చేశారు. దాదాపు 3 వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ చిత్రీకరించారు. టైగర్ జిందాహై తర్వాత ఎక్కువ రోజులు దుబాయ్‌లో షూటింగ్ జరుపుకున్న భారతీయ సినిమా ఇదే. షూటింగ్ ముగిసిన అనంతరం ప్రభాస్ దుబాయ్ మీడియాతో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర అంశాలను పంచుకున్నారు. అబు దుబాయ్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు.
నా సినీ కెరీర్లో చేసిన అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ మూవీ ఇది. ఈ సినిమాకు చేసినంత రిస్కీ సీన్లు ఎప్పుడూ చేయలేదు. ఇందులో బైక్ రేసింగ్ సీన్లలో నా జీవితంలో ఎప్పుడూ నడపనంత వేగంగా బైక్ నడిపాను అని ప్రభాస్ వెల్లడించారు.
రంజాన్ సీజన్ కావడంతో షూటింగుకు అడ్డంకులు ఏర్పడతాయని భావించాం. కానీ దుబాయ్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాలుగా సహకారం అందించారు, మా కోసం అబు దుబాయ్ టీమ్ ట్రాఫిక్ కూడా నిలిపివేశారు అని ప్రభాస్ వెల్లడించారు. ఇక్కడ ప్రభుత్వం సినిమా షూటింగులకు అయ్యే ఖర్చులో 30 శాతం రిబేట్ ఇస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి అని ప్రభాస్ తెలిపారు.
గతంలో బాహుబలి కోసం దాదాపు 10 కేజీల బరువు పెరిగాను. అయితే అన్ని సినిమాలకు అలాంటి ఫిజిక్ అవసరం ఉండదు. అందుకే సాహో కోసం బరువు తగ్గాను. స్పెషల్ డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది అని ప్రభాస్ వెల్లడించారు.

Recommended