IPL 2018: CSK VS SRH Match Preview
  • 6 years ago
An intriguing battle is on the cards when Sunrisers Hyderabad (SRH) clash with Chennai Super Kings (CSK) in the Indian Premier League Qualifier 1 here on Tuesday (May 22).
#IPL2018
#ChennaiSuperkings
#SunrisersHyderabad

అనుకోని కారణాల రీత్యా చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోతే చెన్నైకే నష్టం. ఇప్పటికే లీగ్ దశ ముగించుకుని ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టేందుకు 4 జట్లు సిద్ధమైయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పోటీపడనున్న కీలక జట్లు చెన్నై, హైదరాబాద్‌లలో ఉత్కంఠ పోరు నెలకొననుంది. ఈ క్రమంలో ఇప్పటికే హైదరాబాద్‌ను రెండు సార్లు ఓడించిన చెన్నై ఈ సారి ప్రదర్శనపై అందరికీ ప్రగాఢ నమ్మకముంది.
మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌లో చెన్నై, హైదరాబాద్‌లు తలపడనున్నాయి. ఇది వర్షం కారణంగా రద్దైతే చెన్నై ఎలిమినేషన్ మ్యాచ్ విన్నర్‌తో తలపడాలి. ఆ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారే ఫైనల్‌లో హైదరాబాద్ జట్టుతో తలపడతారు. ఒకవేళ అలా కానున్న పక్షంలో మ్యాచ్‌లన్నీ యథావిధిగానే కొనసాగుతాయి.
ఇప్పటి వరకూ చెన్నై హైదరాబాద్ జట్టుతో రెండు సార్లు తలపడింది. ఏప్రిల్ 22న జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో.. మే 13న జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో చెన్నై జట్టే హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చెన్నైతో తలపడి గెలిచేందుకు హైదరాబాద్ జట్టు భారీ కసరత్తులు చేయాల్సిందే.
Recommended