IPL 2018: CSK Reach IPL Playoffs For Record 9th Time

  • 6 years ago
The tournament features eight teams for the 2018 season, including Delhi Daredevils, Kings XI Punjab, Kolkata Knight Riders, Royal Challengers Bangalore, Rajasthan Royals, Chennai Super Kings, Sunrisers Hyderabad and Mumbai Indians.
#IPL2018
#RajasthanRoyals
#KolkataKnightRiders

ఆరంభం అదరగొట్టి క్రమేపి చప్పని ఆటతీరు ప్రదర్శించింది రాజస్థాన్ జట్టు. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్‌కతా, రాజస్థాన్‌ల సమరంలో ప్లేఆఫ్ ఆశలను వాయిదా వేసుకుంది రాజస్థాన్. హ్యాట్రిక్‌ విజయాలతో ప్లే ఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చిన రాజస్థాన్‌ రాయల్స్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కళ్లెం వేసిన సంగతి తెలిసిందే. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చారు.
భీకర ఫామ్‌లో ఉన్న బట్లర్‌ (36), అతనికి తోడుగా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి (27) పూనకం వచ్చినట్లుగా కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్‌ రాయల్స్‌కు ఐదు ఓవర్లు ముగిసే లోపే స్కోరుబోర్డుపై 60పరుగులు వచ్చి చేరాయి. కానీ అనూహ్యంగా ఐదో ఓవర్‌ చివరి బంతికి త్రిపాఠి వెనుదిరగడం..తర్వాతి బ్యాట్స్‌మెన్‌ కూడా వెంటవెంటనే వరుస కట్టడంతో రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 19ఓవర్లకే ముగిసేసరికి 142పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం కోల్‌కతా 18ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.
అయితే ఐపీఎల్‌లో ఇలా పవర్‌ప్లేలో మెరుగైన ఆరంభం లభించినా.. ఇన్నింగ్స్‌ ముగిసేసరికి తక్కువ పరుగులకే పరిమితం కావడం తొలిసారేమీ కాదు. ఈ వరుసలో ముందున్న జట్టుగా నిజానికి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ముందుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ పవర్‌ప్లేలో 60పరుగులు సాధించినా..ఇన్నింగ్స్‌ ముగిసేసరికి తక్కువ పరుగులతోనే సరిపెట్టుకున్న రెండో జట్టుగా నిలిచింది.

Recommended