IPL 2018: Preity Zinta Gets Angry On Virender Sehwag
  • 6 years ago
Virender Sehwag, one of the most fearless batsmen in his playing days, found himself at the receiving end of a vitriolic verbal barrage from Kings XI Punjab co-owner Preity Zinta on Tuesday, after the Kings failed to chase a modest target of 158 against Rajasthan Royals.
#Preityzinta
#VirenderSehwag
#IPL2018
#KXIP

భారత మాజీ క్రికెటర్, పంజాబ్ జట్టు మెంటార్ వీరేందర్ సెహ్వాగ్‌పై పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతా నోరుపారేసుకుంది. ఐపీఎల్ 11సీజన్‌కు జట్టు మెంటార్‌గానే కాకుండా, ఇంకా కొన్ని కీలక బాధ్యతలు వహిస్తోన్న సెహ్వాగ్‌పై ప్రీతి నిప్పులు చెరిగింది. ఈ విషయంపై పలు కారణాలున్నాయని సమాచారం. ఆఖరి నుంచి వరుసగా జరిగిన 4మ్యాచ్ లలో మూడింటిలోనూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓడిపోయింది.
మే 8 మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన సమయంలో పంజాబ్ కొద్దిపాటి ప్రయోగాలతో క్రీజులోకి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేసి రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపింది. కేవలం 2 బంతులు మాత్రమే ఆడి 0 పరుగులతో వెనుదిరిగాడు. మ్యాచ్ ఓడిపోవడంలో ఈ విషయాన్ని కీలకంగా భావించిన ప్రీతి జింతా మ్యాచ్ అనంతరం సెహ్వాగ్‌తో చర్చించారట.
మార్పులకు ఫలితంగా నిరుత్సాహపరచడంతో వైఫల్యమంతా సెహ్వాగ్‌దే అన్నట్లుగా తిట్టిపోసిందట. ఆవిడకు బదులిచ్చేందుకు, శాంతపరిచేందుకు సెహ్వాగ్ ప్రయత్నించినా అవేమీ పట్టించుకోలేదని ప్రముఖ ఇంగ్లీషు పత్రిక ప్రచురించింది. దీంతో విసుగు చెంది మిగతా భాగస్వాముల దగ్గర ప్రస్తావించాడట.
ఈ విషయం జట్టు ఆటగాళ్లెవరితోనూ చర్చించకపోవడం సెహ్వాగ్ నాయకత్వ లక్షణాలను వ్యక్తపరుస్తోంది. జట్టును ఏ మాత్రం ఒత్తిడికి గురి చేయకూడదనే సెహ్వాగ్ ఇలా చేశాడని సమాచారం. ప్రీతి జింతాతో పాటు సహ యజమాని అయిన మోహిత్ బర్మన్ మాట్లాడుతూ.. 'ఆ సందర్భంలో స్టేడియంలో లేను. అది కేవలం మ్యాచ్ అనంతరం జరిగిన చర్చ మాత్రమే' అని ఆయన పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోని పంజాబ్ ఈ ఏడాది ఆరంభం నుంచి మంచి దూకుడుగా ఆడింది. ఐపీఎల్ వేలం నుంచే సెహ్వాగ్ జట్టులో కీలకంగా వ్యవహరించాడు. జట్టు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేయడంలోనూ, వేలం ఆఖరి సమయంలో క్రిస్ గేల్‌ను కొనుగోలు చేయడంలోనూ అతనిదే పైచేయి.
Recommended