అవనిగడ్డ నుంచి పోటీ చేయనున్న పవన్

  • 6 years ago
Janasena Krishna district incharge Muttamsetty Krishna rao said that Pawan Kalyan trying to contest from Avanigadda segment in 2109 elections. He spoke to media at Avanigadda on Tuesday evening.
#Pawankalyan
#janasena
#Avanigadda
#Elections

కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నుండి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే యోచనలో ఉన్నారని ఆ పార్టీ జిల్లా ఇంఛార్జీ ముత్తంశెట్టి కృష్ణారావు చెప్పారు.. అనంతపురం జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్టు ఇదివరకు ప్రకటించారు. అయితే ముత్తంశెట్టి కృష్ణారావు ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో జనసేనను పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
కానీ, 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడ ఎన్ని స్థానాల్లో పోటీ చేసే విషయమై పార్టీ నేతలతో చర్చించి త్వరలోనే ప్రకటించనున్నట్టు పవన్ తేల్చి చెప్పారు.ఈ మేరకు కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం తర్వాత ముత్తంశట్టి కృష్ణారావు మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.
అయితే ఆవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే విషయమై ఆ పార్టీ ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారనే విషయమై తాజాగా ఆ పార్టీ నేత ముత్తం శెట్టి కృష్ణారావు చేసిన ప్రకటనతో చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లా నుండి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అనంతపురం జిల్లాలోని ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ కూడ నిర్వహించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఈ తరుణంలో ఆవనిగడ్డ నుండి పోటీ చేస్తారనే ప్రకటన రావడంతో పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అనంతపురంతో పాటు ఆవనిగడ్డ నుండి కూడ పోటీ చేస్తారా అనే చర్చ కూడ సాగుతోంది. మరో వైపు తిరుపతి నుండి కూడ పవన్ పోటీ చేస్తారనే ప్రచారం కూడ ఉంది.
రాయలసీమలోని అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకొన్న నిర్ణయం రాజకీయంగా ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు వెనుకబడిన ప్రాంతం నుండి ప్రాతినిథ్యం వహించడం ద్వారా అక్కడి సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం దక్కుతోందనే అభిప్రాయం ఉండి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

Recommended