Anu Emmanuel Skipped The Movie Promotions

  • 6 years ago
Naa Peru Surya, Naa Illu India is Telugu language action film written and directed by Vakkantam Vamsi. Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. This movie released on May 4th, 2018. In this occassion, only film unit promoting the film. Anu Emmanuel is away from the promotional events. The team unit is very much worried as Allu Arjun is promoting the film alone and they need the push up from the heroine as well.
#NaaPeruSurya
#VakkantamVamsi
#AnuEmmanuel

అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం నా పేరు సూర్య. కథా రచయితగా మంచి పేరు తెచ్చుకొన్న వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంపై అన్ని వర్గాల నుంచి ప్రేక్షకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే వంద కోట్ల క్లబ్‌కు చేరువైన ఈ చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది.
అందాల తార అను ఇమ్మాన్యుయేల్ టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అవుతున్నాయి. గతంలో అను నటించిన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్, అజ్ఞాతవాసి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్ల పడ్డాయి. ప్రస్తుతం ఆమె నటించిన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టింది. ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే నా పేరు సూర్య చిత్ర ప్రమోషన్‌లో అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడ కనిపించకపోవడంపై సినీ వర్గాల్లో చర్చానీయాంశమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొనేలా చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదట. దాంతో నిర్మాతలు, దర్శకులు, అల్లు అర్జున్ మాత్రమే ప్రమోషన్‌లో బిజీగా కనిపిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ ఇలా వ్యవహరించడంపై చిత్ర యూనిట్ ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.

Recommended