IPL 2018: Williamson Is Quite Like Dhoni Says Gavaskar
  • 6 years ago
Expert Column News: Gavaskar feels Kane Williamson has raised the level of the game several notches and in the process showed that a batsman does not have to be a blaster.

మ్యాచ్ ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా.. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తుంటాడు ధోనీ. జట్టు ప్రదర్శన, ఆట తీరులో మార్పు కనబరుస్తాడు కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కంగారుపడటం, ఉద్వేగానికి లోనవడం వంటివి చేయడు. ఇప్పుడు అచ్చం ధోనీలాగే వ్యవహరిస్తున్నాడంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ను పోలుస్తున్నాడు సునీల్‌ గవాస్కర్.
మ్యాచ్‌లో ఉత్కంఠకు లోనైన సందర్భాల్లోనూ ప్రశాంతతను వీడట్లేదని, తద్వారా జట్టు సభ్యుల్లో ఉద్వేగాన్ని తగ్గిస్తున్నాడని పేర్కొన్నారు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మ్యాచ్ నుంచి తప్పుకోవడంతో యాజమాన్యంతో సహా అభిమానులు కూడా షాక్‌కు గురైయ్యారు.
అంతే స్థాయిలో కొత్త కెప్టెన్ న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాయకత్వ బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తాడా అనే సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, అవన్నీ పటాపంచలు చేస్తూ.. ఆ బాధ్యతలు అత్యుత్తమంగా నెరవేరుస్తున్నాడు కేన్‌. నిలకడగా రాణిస్తూ చక్కని విజయాలు అందించాడు. దీంతో 9 మ్యాచుల్లో 7 గెలిచిన హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
జట్టులో విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండాలన్న నిబంధనతో గతేడాది విలియమ్సన్‌కు తగినన్ని అవకాశాలు రాలేదు. ఈ సారి మాత్రం ప్రతి మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతూ 9 మ్యాచుల్లో 364 పరుగులు చేశాడు. మెరుపు సిక్సర్లు బాదకున్నా నిలకడగా హాఫ్ సెంచరీలు సాధిస్తున్నాడు.
Recommended