IPL 2018: Yusuf's Perfect Catch of the Match
  • 6 years ago
Yusuf Pathan pulled off a stunning one-handed catch at short third man that brought to an end Virat Kohli's stay at the crease.
#YusufPathan
#ViratKohli
#IPL2018

కోహ్లి, డివిలియర్స్‌ లాంటి ఆటగాళ్లున్న జట్టు ముందు 147 పరుగుల లక్ష్యం ఏమంత పెద్దగా అనిపించదు. ఐతే భీకరమైన బౌలింగ్‌తో సత్తా చాటుతున్న సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ కాపాడుకోడానికి ఆ స్కోరు సరిపోయింది. ఆ జట్టు బౌలర్లు అద్భుతమైన బంతులతో విజృంభిస్తుంటే హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌ తోకముడిచారు. నిజానికి మొదట్లో పరిస్థితి బెంగళూరుకు అనుకూలంగానే కనిపించింది.
ఓపెనర్లు పార్థివ్‌ పటేల్‌ (20), మనన్‌ వోహ్రా (8) ఎంతోసేపు క్రీజులో నిలవకపోయినా.. కెప్టెన్‌ కోహ్లి నిలకడగా ఆడటంతో బెంగళూరు లక్ష్యం వైపు సాగింది. ఒక ఎండలో షకిబ్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌, రెండు ఫోర్లతో చెలరేగాడు. విరాట్‌. మరో ఎండ్‌లో డివిలియర్స్‌ (5) ఉండటంతో బెంగళూరుదే మ్యాచ్‌ అనిపించింది..
సన్‌రైజర్స్ గెలవాలంటే కోహ్లిని పెవిలియన్ చేర్చడమే మార్గం అనుకుంటున్న తరుణంలో.. షకీబ్ బౌలింగ్‌లో యూసుఫ్ పఠాన్ అద్భుత క్యాచ్‌తో విరాట్‌ను ఔట్ చేశాడు.
షకీబ్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో విరాట్ బంతిని కట్ చేయబోయాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని బంతి గాల్లోకి లేచింది. థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న పఠాన్ వెనక్కి వెళ్తూ.. ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. కోహ్లి ఔటవడంతో సన్‌రైజర్స్ సంబరాల్లో మునిగిపోయింది. తర్వాత మన్‌దీప్-గ్రాండ్‌హోమ్ పోరాడినా.. సన్‌రైజర్స్‌దే పైచేయిగా నిలిచింది
Recommended