IPL 2018 : Dhoni Given Strength to Ashwin Says Finch
  • 6 years ago
The camaraderie between MS Dhoni, Ravichandran Ashwin and Virat Kohli, three leading Indian cricketers of the present era, extends beyond the cricket field.
#Dhoni
#KXIP
#IPL 2018
#Ashwin

భారీ అంచనాలతో ఐపీఎల్ 11వ సీజన్‌ను మొదలుపెట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మంచి జోరు మీదనే దూసుకుపోతోంది. ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న నాటి నుంచి వేలంలో కొనుగోలు చేయడం, కెప్టెన్‌గా అశ్విన్‌ను ఎంపిక చేయడం.. ఇవన్నీ పంజాబ్‌కు కలిసొచ్చాయి. జట్టుకు ప్రధాన బలంగా మారిన క్రిస్ గేల్‌ను వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడంతో కేవలం ప్రారంభ ధరకే పంజాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నడూ లేని రీతిలో కింగ్స్ ఎలెవన్ బలంగా కనిపిస్తోంది. అశ్విన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. తొలినాళ్లలో ఒక బౌలర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని నెటిజన్లు సైతం ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అశ్విన్ తనదైన వ్యూహాలతో పంజాబ్‌కు విజయాలు అందిస్తున్నాడు. దీంతో ప్రీతి జింతా, వీరేంద్ర సెహ్వాగ్ తెగ సంబరపడిపోతున్నారు. తొలి ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడే దిశగా జట్టును నడిపిస్తోన్న అశ్విన్‌‌పై పంజాబ్‌ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ లక్షణాల వల్లే అశ్విన్ ప్రశాంతంగా ఉంటున్నాడని తెలిపాడు.
‘అశ్విన్‌కు గతంలో కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేదు. కానీ కెప్టెన్‌గా అతడు రాణిస్తున్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే అశ్విన్ ఆటగాళ్లతో మాట్లాడతాడు. బ్రాడ్ హాగ్‌తో కలిసి అశ్విన్ సన్నద్ధమయ్యే విధానం బాగుంటుంది. ధోనీతో కలిసి చాలా ఏళ్లపాటు పని చేసిన అశ్విన్ అదే తరహాలో కామ్‌గా ఉండటం అలవర్చుకున్నాడు. ధోనీలాగే అశ్విన్ ప్రశాంతంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటాడ'ని ఫించ్ అశ్విన్‌ను ఉద్దేశించి మీడియాకు చెప్పాడు.
సుదీర్ఘకాలం చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన అశ్విన్‌ను ఆ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోకపోవడంతో పాటు.. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో.. అతడ్ని పంజాబ్ దక్కించుకుంది. అశ్విన్‌ని కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించడం విశేషం.
Recommended