IPL 2018 : KL Rahul Speaks About His Winning Strategy

  • 6 years ago
KL Rahul scores the winning runs and rightly so, timing one through the covers and it races away to the boundary. Kings XI Punjab chase the target comfortably in the end and win this one by 6 wickets

ఐపీఎల్ లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత రాజస్థాన్‌ను 152 పరుగులకే కట్టడి చేసి అనంతరం పంజాబ్.. సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ (84)) అజేయంగా హాఫ్ సెంచరీతో పంజాబ్‌ను గెలిపించాడు. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ మూడోస్థానానికి చేరుకుని, ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది.
అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్‌ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్‌ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద'ని అన్నాడు.
ఈ సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ 50 నమోదు చేశాడు. ఆ ఇన్నింగ్స్ కంటే రాజస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్సే అత్యుత్తమమని కేఎల్ రాహుల్ చెప్పాడు. వ్యక్తిగతంగా నాకు నిజంగా సంతృప్తి కలిగించిన ఇన్నింగ్స్ ఇదేనని మ్యాచ్ అనంతరం ఈ పంజాబ్ ఓపెనర్ చెప్పాడు. చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందన్నాడు.

Recommended