IPL 2018: CSK VS KKR Preview | Oneindia Telugu
  • 6 years ago
ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
పరాజయం నుంచి కోలుకొని వెంటనే గెలుపు బాట పట్టడం ఐపీఎల్‌ జట్లకు ఎంతో అవసరం. ముంబై చేతిలో ఓడిన తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ సరిగ్గా ఇదే చేసి చూపించింది. కొత్త ఓపెనింగ్‌ జోడితో ప్రయోగం చేసి కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆ జట్టు ఢిల్లీని ఓడించింది. సత్తా చాటుతున్న రాయుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను ఎంత చక్కటి ఆటగాడో నిరూపించాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో దూకుడుగా ఆడాలో, ఏ సమయంలో సింగిల్స్, రెండు పరుగులు తీసి చకచకా ఇన్నింగ్స్‌ను నడిపించాలో అతనికి బాగా తెలుసు.
Table toppers Chennai Super Kings (CSK) would look to continue its winning momentum and spoil the homecoming of Kolkata Knight Riders (KKR) in the Indian Premier League (IPL) tie at the Eden Gardens here on Thursday (May 3).
Recommended