Yes! Iam King Admits Chris Gayle
  • 6 years ago
West Indian batsman Chris Gayle, who now plays for Kings XI Punjab in the IPL, said it was disappointing not to get retained by the Royal Challengers Bangalore despite the franchise giving him signals to that effect.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ విభాగంలోనూ పరవాలేదనిపించుకుని వరుస విజయాలతో ఐపీఎల్ లీగ్‌ జాబితాలో టాప్ 3 స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు తరపున విధ్వంసకర బ్యాటింగ్ చేస్తోన్న క్రిస్ గేల్ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. బంతిని బౌండరీలకు పరిగెత్తిస్తూ.. అతన్ని వేలంలో కొనుగోలు చేయని జట్లకు .. తగిన సమాధానం చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లీషు ప్రముఖ మాద్యమమైన 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను ఇలా వెల్లడించాడు.
ఐపీఎల్ వేలం జరుగుతుండగా రెండో రోజు ఆఖరి సమయంలో క్రిస్ గేల్ ను కొనుగోలు చేయడంపై ఆయన ఉద్రేకానికి లోనైయ్యారా అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. ప్రతి క్రికెటర్ అన్ని ఫార్మాట్ లను వదిలేయాల్సిన రోజు ఒక్కటి వస్తది. దానికి సిద్ధంగా ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాను. కానీ, చివర్లో పంజాబ్ జట్టు నన్ను కొనుగోలు చేసింది. పంజాబ్ జట్టుకు ఆడుతుండటాన్ని గొప్పగా భావిస్తున్నాను.
గతేడాది బెంగళూరు జట్టుకు ఆడాను. ఈ సారి కూడా ఆడేందుకు ఏ అభ్యంతరం చెప్పలేదు. కానీ, వాళ్లు రిటైన్‌డ్ జాబితాలో నన్ను ఉంచలేదు. అప్పుడే అర్థమైంది. నేను వాళ్లతో ప్రయాణించేందుకు వాళ్లు సుముఖంగా లేరు అని. వేరే జట్టు కోసం ఎదురుచూశా. అప్పటికీ రెండు రౌండ్లు అయిపోయాయి. ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడంతో.. బీపీఎల్, సీపీఎల్‌లలో ఆడిన ఘనత సరిపోతుంది. ఐపీఎల్ సెలక్ట్ కాకపోయినా పరవాలేదనుకున్నా. వాళ్లలెవరికో నేనేంటో చూపించుకోవాల్సిన పనిలేదు. నా రికార్డులే చెప్తాయి అని చెప్పారు క్రిస్ గేల్.

#KXIP
#Gayle
#KKR
#IPL 2018
Recommended