వర్క్ పర్మిట్స్ రద్దు చేస్తే అమెరికాకు నష్టమే

  • 6 years ago
Influential lawmakers and representatives of the American IT industry, including Facebook, have opposed the Trump administration’s proposed plan to withdraw work permits to the spouses of H-1B visa holders, a majority of whom are Indian professionals.

అమెరికాలో హెచ్ -4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు రద్దు చేయాలన్న ప్రతిపాదనపై వ్యతిరేకత నెలకొంది. ఈ ప్రతిపాదన అమెరికాకు తీవ్ర నష్టాన్ని చేసే అవకాశం ఉందని టెక్ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నాయి. ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. దీనికి తోడుగా హెచ్ -4 వీసాలు కలిగి ఉన్నవారికి ఉద్యోగాలను ఇచ్చే విషయాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు వత్యిరేకిస్తున్నారు.
అమెరికాలో హెచ్ 4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు ఇవ్వకూడదని తీసుకొస్తున్న ప్రతిపాదన పట్ల అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో పాటు టెక్ కంపెనీల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్ వంటి కంపెనీ కూడ ఈ రకమైన ప్రతిపాదనను విరమించుకోవాలని అమెరికన్ సర్కార్ ను కోరుతోంది. దీనివల్ల అమెరికాకు లాభం కంటే నష్టమే జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు ఇవ్వకుండా వర్క్ పర్మిట్స్ రద్దు చేయాలన్న ప్రతిపాదన అమెరికా ఆర్ధిక వ్యవస్థకే ప్రమాదమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికాలోని కంపెనీలకు వీలు కల్పించేవి హెచ్‌-1బీ వీసాలు ఆ హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్‌-4 వీసాలను మంజూరు చేస్తారు. ఈ వీసాలు కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నిలిపివేయడం వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Recommended