5 Sachin Tendulkar Records that no one was able to break

  • 6 years ago
He made his debut as a 16-year-old against Pakistan, who boasted of a feared pace attack. Despite a bloodied nose and a few failures, the little boy from Dadar scaled new peaks and became the greatest batsman since the days of Don Bradman.

క్రికెట్‌ చరిత్రలో సచిన్ అనే పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న దిగ్గజ హీరో క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సోమవారం 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతని చరిత్రను ఓ సారి గుర్తుచేసుకుంటూ.. 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ అరంగేట్రం చేశారు. కెరీర్‌ తొలినాళ్లలో ఒడిదుడుకులకు గురైన సచిన్‌.. గాడ్ ఆఫ్ ద క్రికెట్ అనిపించుకున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 25 సంవత్సరాల్లో సచిన్‌ అంటే ఓ బ్రాండ్‌ అనే స్థాయికి ఎదిగిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100 సెంచరీలతో 34,357 పరుగులు సాధించారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సచిన్‌ రిటైర్‌ అయ్యారు. 45 ఏళ్ల సచిన్‌కు చెందిన 5 రికార్డులు భవిష్యత్‌ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాకపోవచ్చు.
తన వన్డే కెరీలో 463 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 96 అర్థసెంచరీలు చేశారు. ఇది ఒక రికార్డు. సాధారణంగా అర్థ సెంచరీల రికార్డుపై ఎక్కువ దృష్టి ఉండదు. అయితే, ప్రస్తుత భారత కెప్టెన్‌ కోహ్లి ఇప్పటికే 46 అర్థ సెంచరీలను సాధించారు. మరో 50 అర్థ సెంచరీలు చేస్తే గానీ ఈ రికార్డును అధిగమించలేరు.
2012లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్‌ నిలిచాడు. ఆ రికార్డు నెలకొల్పిన ఆరేళ్ల తర్వాత విరాట్‌ కొహ్లీ 56 సెంచరీలు, హషీమ్‌ ఆమ్లా 54 సెంచరీలతో దీనిపై కన్నేశారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా నిలకడగా ఆడుతూ వస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ ఈ రికార్డును కచ్చితంగా అధిగమిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే, మరో 44 సెంచరీలను చేస్తే తప్ప కొహ్లీ ఈ ఫీట్‌ను సాధించలేరు.
సచిన్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో 200 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌లు 168 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం అల్‌స్టెర్‌ కుక్‌ (154 టెస్టులు), జేమ్స్‌ అండర్సన్‌ (136 టెస్టులు)లు ఇంకా టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నారు. అయితే, వీరు ఇరువురూ 30 ఏళ్లకు మించి వయసు పైబడిన వారే. 200 టెస్టులు ఆడి సచిన్‌ రికార్డును వీరు బ్రేక్‌ చేస్తారా? అన్నది అనుమానమే.

Recommended