Gary Kirsten On Talent Hunt From April 23 In Pune

  • 6 years ago
Former Indian cricket team chief coach Gary Kirsten will be looking for exceptional young cricketers in India between April 23 and May 18. Six players from 8 cities will be invited to Pune for a weekend training programme following which the three top players will be given a scholarship worth Rs 2 lakhs each for a 2-month residential High-Performance Camp at Gary Kirsten Cricket.

భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ భావి క్రికెటర్లకు ఓ సదవకాశాన్ని కల్పించనున్నాడు. మీలో టాలెంట్‌ దాగి ఉంటే అప్లై చేయండి. మాజీ కోచ్‌ గ్యారీ యువ క్రికెట్లర్లలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఓ వినూత్న కార్యక్రమం రూపొందించాడు. ఈ నెల 23 నుంచి వచ్చే మే నెల 18వరకు టాలెంట్‌ స్కౌట్‌ కార్యక్రమం ప్రారంభించాడు. 25 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్ లో భారత్‌లోని 8 నగరాల నుంచి మంచి నైపుణ్యం ఉన్న ఆరుగురు క్రికెటర్లను ఎంపిక చేయనున్నాడు.
టాప్‌లో నిలిచిన ఆరుగురు యువ క్రీడాకారులకు పూణెలో వీకెండ్‌ ట్రైనింగ్‌ ఇవ్వనున్నాడు. అలాగే టాప్‌లో నిలిచిన ముగ్గురు క్రీడాకారులకు ఒక్కొక్కరికి రూ. 2లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు రెండు నెలల పాటు గ్యారీ కిర్‌స్టెన్‌ క్రికెట్‌లో ఉండేందుకు సౌకర్యం కల్పించనున్నారు. టాలెంట్‌ స్కౌట్‌ ఎంట్రీ ఫీజు రూ.1000. దీనిలో పాల్గొనేందుకు కేవలం టాలెంట్‌ మాత్రమే అర్హత.
అండర్ 19, అండర్ 14, ఓపెన్ అంటూ మూడు కేటగిరీలుగా ఎంపికచేయనున్న టాలెంట్‌ హంట్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు వారి పేరు, నగరం, కాంటాక్ట్‌ వివరాలు 9112295566 ఫోన్‌ నెంబర్‌కు వాట్సప్‌ చేయడమే.

Recommended