IPL 2018: Punjab Wins Over Kolkata

  • 6 years ago
Huge victory for Punjab. Both Rahul and Gayle have thrashed the KKR bowling to all corners of Eden Gardens and the fielding captain had absolutely no clue of how to stop them. Feel, Karthik missed a trick by not bowling spinners against Gayle early. However, Mavi's bowling is the only positive for the home side in the second half of the match.

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు క్రిస్‌గేల్ (62 నాటౌట్: 38 బంతుల్లో 5x4, 6x6), కేఎల్ రాహుల్ (60: 27 బంతుల్లో 9x4, 2x6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 8.2 ఓవర్లు ముగిసే సమయానికి 96/0తో నిలిచిన దశలో వర్షం రావడంతో దాదాపు గంట మ్యాచ్ సమయం వేస్ట్ అయ్యింది. దీంతో.. మ్యాచ్‌ని 13 ఓవర్లకి కుదించిన అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో టార్గెట్‌ని 125 పరుగులుగా నిర్ణయించారు. అప్పటికే జోరుమీదున్న క్రిస్‌గేల్, కేఎల్ రాహుల్ భారీ సిక్సర్లతో మ్యాచ్‌ని కొనసాగించారు. అర్ధశతకం అనంతరం కేఎల్ రాహుల్ ఔటైనా.. గెలుపు లాంఛనాన్ని మయాంక్ అగర్వాల్(2)తో కలిసి క్రిస్‌గేల్ 11.1 ఓవర్లోనే పూర్తి చేశాడు.

Recommended