‘ధర్మ పోరాట దీక్ష’ లో బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

  • 6 years ago
Tollywood Actor and Hindupur MLA Balakrishna speaking from the venue of deeksha conveyed his birthday wishes to CM Chandrababu. He praised Chandrababu for staging hunger protest on his birthday for his native land, and also in the interest of 5 crore AP people.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు.
అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల లోటు బడ్జెట్‌తో ఏర్పడిన ఏపీని తన అనుభవంతో చంద్రబాబునాయుడు అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటుందని, సహాయం అందిస్తుందనే ఆశతోనే టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుందని, ఎన్డీఏలో చేరిందని బాలకృష్ణ చెప్పారు.
మోడీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని, ఆంధ్రప్రదేశ్ అని బాలకృష్ణ అన్నారు. కేంద్రంపై విమర్శలు చేసిన సమయంలో బాలకృష్ణ హిందీలో మాట్లాడటం గమనార్హం. ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ రాష్ట్రాల్లో విభేదాలు సృష్టిస్తున్నారని మోడీపై బాలకృష్ణ ఆరోపణలు చేశారు
పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేసి నిరాహార దీక్షలంటూ నాటకాలాడారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బాలకృష్ణ విమర్శించారు. ఆ రాజీనామాలు, దీక్షల వెనుక ప్యాకేజీ ఒప్పందాలున్నాయని ఆరోపించారు. కొజ్జాల్లాగా సీట్లు గెలవాలనుకుంటున్నారని వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక యుద్ధం మొదలైందని.. బీజేపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.అప్పట్లో బీజేపీకి అధికార బిక్ష పెట్టింది ఎన్టీఆర్, చంద్రబాబులేనని బాలకృష్ణ అన్నారు.

Recommended