బంద్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కేసులు పెడతాం : ఏ.పి పోలీసులు

  • 6 years ago
Andhra Pradesh Bandh continued on Monday for special status. RTC buses are stopped at Depots and schools and colleges are closed.Andhra Pradesh is preparing for a state-wide bandh on April 16 to protest the Centre's refusal to grant Special Category Status to the state.The one-day shutdown was called by the Pratyeka Hoda Vibhajana Hameela Sadhana Samithi, and is backed by the Left parties, chief opposition YSR Congress party, and actor-politician Pawan Kalyan's Jana Sena party.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు సోమవారం బంద్‌ పాటించారు.తిరుపతిలో స్వచ్ఛందంగానే బస్సులను నిలిపివేశారు. అయితే, తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపునిచ్చారు.
సోమవారం జరగాల్సిన వివిధ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు మూతబడ్డాయి.
బంద్‌కు జనసేన, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో వైసీపీ అధినే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రకు విరామం ఇస్తారు. మంగళవారం పాదయాత్ర కొనసాగుతుంది.
మరోవైపు, బంద్‌కు జనసేన కూడా మద్దతు తెలిపింది. జనసేన కార్యకర్తలు బందులో పాల్గొనాలని ఆ పార్టీ ప్రకటించింది.
సోమవారం నాటి బంద్‌పై చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఆర్టీసీ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిరసనలు శాంతియుతంగా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలతో నిఘా పెట్టాలన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం, మన నిరసన సున్నితంగా ఉండాలన్నారు.
బంద్ నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.బంద్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కేసులు పెడతామన్నారు. ట్రాఫిక్ అవరోధాలు కలిగించినా, ఆస్తులు ధ్వంసం చేసినా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. ఉద్యమ నేతలకు వ్యక్తిగతంగా నోటీసులు పంపిస్తామన్నారు. దీనిపై లెఫ్ట్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బంద్ విజయవంతం చేస్తామన్నారు. బంద్ విఫలం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.