Sri Reddy Shocking Comments On Singer Sri Ram
  • 6 years ago
Sri Reddy shocking comments on singer Sri Ram. Sri Reddy continues her protest.


శ్రీరెడ్డి పోరాటంతో మా అసోసియేషన్ ఓ మెట్టు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం టాలీవుడ్ లో సెగలు పుట్టిస్తోంది. మా అసోసియేషన్ దిగివచ్చిన శ్రీరెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. శ్రీరెడ్డికి అనూహ్యంగా విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల మద్దత్తు లభించిన సంగతి తెలిసిందే.
ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూ లో శ్రీరెడ్డి మాట్లాడుతూ ఇండియన్ ఐడల్ ఫేమ్ సింగర్ శ్రీరామ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాడు చూడడానికి అమాయకుడిలా ఉంటాడని, అతడి బుద్ది కూడా అంతే అని అన్నారు. అభిమానులంతా అతడికి సపోర్ట్ చేసి గెలిపిస్తే.. ఆయన చేసే పనులు దారుణంగా ఉంటాయని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.
సినీ ఇండస్ట్రీలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చాలా మందికి అవగాహన ఉండని అందుకే తల్లి దండ్రులు వారి పిల్లలని సినీ ఇండస్ట్రీకి పంపడానికి ఇష్టపడడం లేదని శ్రీరెడ్డి తెలిపింది.
ఇండస్ట్రీలో పెద్ద స్థాయి వ్యక్తుల నుంచి క్రింది స్థాయి వరకు వేధింపులు జరుగుతున్నాయని, మహిళా జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని శ్రీరెడ్డి తెలిపింది.
యూట్యూబ్ ఛానల్స్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే వైవా హర్ష కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నాడని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. షార్ట్ ఫిలిమ్స్ లో నటించాలనుకునే అమ్మాయిలకు కూడా ఏ పరిస్థితి తప్పడం లేదని ఆమె వాపోయింది.
Recommended