మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించిన జనం

  • 6 years ago
Bellary BJP MP B.Sriramulu faced protest by S.Thippeswamy supporters in Molakalmuru assembly constituency in Chitradurga.

కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా బీజేపీలో అసమ్మతి తీవ్రస్థాయిలో మొదలైయ్యింది. బళ్లారితో పాటు ఉత్తర కర్ణాటకలో బలమైన నాయకుడిగా పేరు ఉన్న బళ్లారి బీజేపీ ఎంపీ బి. శ్రీరాములకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వందలాధి మంది ఒక్కసారిగా మా నియోజక వర్గంలో మీరు పోటీ చెయ్యరాదని చీపుర్లు చూపించి ఎదురుతిరగి కారు మీద చెప్పులు విసరడంతో బీజేపీ ఎంపీ శ్రీరాములు ఒక్కసారిగా షాక్ కు గురైనారు.
చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములుకు బీజేపీ అధిష్టానం సూచించింది. వాల్మీకీ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గం కేటాయించడంలో ఎంపీ శ్రీరాములు ఆ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.
శుక్రవారం బళ్లారి ఎంపీ శ్రీరాములు చిత్రదుర్గ జిల్లాలోని మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గంలోని నాయకనహెట్టి ప్రాంతంలో ప్రచారం చెయ్యడానికి వెళ్లారు. నాయకనహెట్టిలోని ప్రసిద్ది చెందిన దేవాలయంలో పూజలు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు ప్రయత్నించారు.
మాళకాల్మూరు నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్. తిప్పేస్వామి అనుచరులు, అభిమానులు శ్రీరాములును దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
తిప్పేస్వామి మద్దతుదారులు వందలాధి మంది మహిళలు ఒక్కసారిగా చీపుర్లు, చెప్పులతో శ్రీరాములుకు వ్యతిరేకంగా ఎదురుతిరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది సహనం కోల్పోయి శ్రీరాములు కారు మీద చెప్పులు విసరడంతో పరిస్థితి అదుపుతప్పింది.

Recommended