Krishnarjuna Yuddham Cinema Review కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ
  • 6 years ago
After Success of MCA, Actor Nani latest film is 'Krishnarjuna Yuddham. The film will be hitting screens on April 13, 2018. Merlapaka Gandhi is directed this movie. Ruskar Mir, Anupama Parameswaran are lead pair to Nani. Hip Hop Tamizha composed the music. Nani playing dual role again. In this occassion Telugu filmibeat brings exclusive review for..

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ప్రతీ సినిమాకు కలెక్షన్లపరంగానే కాకుండా నటనపరంగా పైచేయి సాధిస్తున్నారు నాని. మజ్ను, నిన్నుకోరి, ఎంసీఏ చిత్రాలు నాని ప్రతిభకు, స్టామినాకు అద్దం పట్టాయి. విభిన్నమైన చిత్రాల ఎంపికతో తన మార్కును సొంతం చేసుకొంటున్నారు. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో నాని నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం ద్వారా మరోసారి ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కృష్ణ (నాని) చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు. చాలా ముతకగా ఉంటాడు. చదువు సంధ్యలు పెద్దగా అబ్బకపోవడంతో వ్యవసాయ పనులు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుంటాడు. అలా సాగుతున్న కృష్ణ జీవితంలోకి రియా (రుస్కర్ మీర్) ప్రవేశిస్తుంది. రియా బాగా చదువుకొన్న అమ్మాయి కావడం, డబ్బున్న కుటుంబానికి చెందడంతో వారి ప్రేమకు పెద్దలు అంగీకారం లభించదు. దాంతో పెద్దలు రియాను హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. చిత్తూరులో కథ ఇలా ఉంటే.. యూరప్‌లోని ప్రాగ్‌లో నివసించే అర్జున్ (నాని) ఓ రాక్‌స్టార్. అమ్మాయిలంటే అర్జున్‌కు ప్రపంచం. అలాంటి జీవితంలో బతికే అర్జున్‌కు సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) తారసపడుతుంది. సుబ్బలక్ష్మిని తొలిచూపులోనే అర్జున్ ప్రేమిస్తాడు. కానీ అర్జున్ ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె అతడి ప్రేమను తిరస్కరించి హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకొంటుంది.
హైదరాబాద్‌కు బయలుదేరిన రియా, సుబ్బలక్ష్మిలు ఓ ఆపదలో చిక్కుకొంటారు. ఆ ఇద్దరికి ఎదురైన సమస్య ఏమిటి? ప్రాగ్‌లో ఉండే అర్జున్, చిత్తూరులో నివసించే కృష్ణ తమ ప్రియురాళ్లను సమస్యను ఎలా బయటపడేశారు. అందుకోసం వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే కృష్ణార్జున యుద్ధం సినిమా కథ.
తొలిభాగంలో చిత్తూరు, ప్రాగ్‌లో ఉండే కృష్ణ, అర్జున్ జీవితాలకు సంబంధించిన సన్నివేశాలతో కొంత ఆసక్తిగా సాగుతుంది. అర్జున్ జీవితం కొంత మోడర్ టచ్, కృష్ణ జీవితంలో రూరల్ టచ్‌ను బ్యాలెన్స్ చేయడం సినిమాపై ఇంట్రస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ప్రథమార్థంలో నిడివి ఎక్కువగా ఉండటంతో విరామం కోసం ప్రేక్షకుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడ బ్రహ్మానందం కామెడీ, సంగీత శిక్షణ అంశాలు ప్రేక్షకుల్లో కొంత జోష్‌ను పెంచడానికి దోహదపడుతాయి. కానీ ఓ రెగ్యులర్ పాయింట్‌తో ఇంటర్వెల్‌‌ కార్డు పడుతుంది.
సినిమా రెండో భాగం ఏమిటో ఇంటర్వెల్ కార్డుతోనే ప్రేక్షకుడికి అర్ధం అవుతుంది. ప్రేక్షకుడి బుర్రకు పెద్దగా పెట్టాల్సిన అవసరమే ఉండదు. కాకపోతే సెకండాఫ్‌లో బాగ వాడిపడేసిన పాయింట్‌తో సినిమాను ముందుకు నడిపించడం ఓ మైనస్ అని చెప్పవచ్చు. కథ ఎంత పాతదైనా పర్వాలేదు.. కనీసం కొత్తగా సీన్లు, స్క్రీన్‌ప్లే రాసుకొని గలిగి ఉంటే సినిమాను నాని మరో స్థాయికి తీసుకెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ రెగ్యులర్, రొటిన్ అంశాలు సహనాన్ని పరీక్ష పెట్టాయా అనేలా ఉంటాయి.
గత చిత్రాల సక్సెస్‌తో దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పెంపొందించుకొన్నాడు. గాంధీ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ఫీలింగ్‌తో ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చే పరిస్థితి ఉంది. తాజాగా నానితో కలిసి సినిమా చేయడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కృష్ణార్జునయుద్ధంలో చిత్తూరు యాస‌తో రాసుకొన్న పాత్రలు కొంత కొత్తదనాన్ని అందిస్తాయి. కానీ కథ, కథనాలపై జాగ్రత్త వహించాల్సిన చోట దర్శకుడు విఫలమయ్యారనే చెప్పవచ్చు.
Recommended