Sri Reddy Removed Her Dress In Film Nagar

  • 6 years ago
Sri Reddy Mallidi Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about Filmi Industry. Recently, She leaked some photos in social media.

ఇటీవల టాలీవుడ్ లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి అన్నంత పని చేసింది. శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా కాస్టింగ్ కౌచ్ దారుణాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. తనని చాలా మంది సినీప్రముఖులు అవకాశాల పేరుతో వాడుకుని వదిలేశారని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
శనివారం ఉదయమే శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం ఛాంబర్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ ముందు తన ఒంటిపై ఉన్న బట్టలను విప్పేసింది. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న జనం ఉలిక్కిపడ్డారు. అప్పటికే కొందరు మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకొన్నారు.
మూవీ ఆర్టిస్ అసోషియేషన్‌లో తనకు సభ్యత్వం ఇవ్వడం లేదు. తనకు అన్యాయం చేస్తున్నారు. తన ఆవేదనను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ చర్యకు పూనుకొన్నాను అని శ్రీరెడ్డి మీడియాకు వివరించింది.
ఇటీవల ఓ టెలివిజన్ చర్చ కార్యక్రమంలో సినీ పరిశ్రమలోని పెద్దలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నటిగా నాకు ఇండస్ట్రీలో గుర్తింపు లేదు. గుర్తింపు కార్డు ఇవ్వలేదు. సీనియర్ నటులు నాకు అండగా నిలువడం లేదు. తెలుగు అమ్మాయిలు కష్టపడుతుంటే నోరు మూసుకుంటున్నారు. ఓ ఆడదాని ఆవేదన పట్టించుకోవడం లేదు. నాకు జరుగుతున్న అన్యాయం మీడియా ద్వారా బయటపెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆడవాళ్ల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సర్కారు ఎందుకు మౌనంగా ఉంటున్నది. ఇలాంటి అన్యాయాలకు ప్రభుత్వం చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.

Recommended