Balakrishna Emotional Speech On NTR Biopic Release
  • 6 years ago
Nandamuri Balakrishna Powerful Speech at NTR Biopic Movie Launch Event. #NTRBiopic, is launching on 29 March 2018, at Ramakrishna Studios, Hyderabad, by the Honorable Vice President of India, Sri M. Venkaiah Naidu garu, as the Chief Guest.


మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్ర ప్రారంభోత్సవం గురువారం ఉదయం నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ పోషించిన పాపులర్ పాత్రల్లో ఒకటైన దుర్యోధనుడి గెటప్‌లో బాలయ్య హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన పవర్‌ఫుల్ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది.
'ఎన్' అంటే నటనాలయం. ఆయన ఇల్లే నటనాలయం. ఆయన నటరాజు నటసింహుడు. 'టీ' అంటే తారా మండలంలోని ధ్రువతారకుడు. 'ఆర్' అంటే రాజర్షి, రారాజు, రాజకీయ దురంధరుడు... అని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ కేవలం కళ కోసమే కాదు, సమాజం కోసం పని చేశారు. ఆయన చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలి, భావితరాలకు తెలియాలి అనే ఒక తలంపుతో ఈ సినిమా మొదలు పెట్టాం. అదే విధంగా రామరావుగారి పాత్ర వేరే ఎవ్వరూ చేయలేరు, ఆ అదృష్టం నాకు కలిగినందుకు సంతోషంగా ఉంది.... అని బాలయ్య తెలిపారు.
రామారావుగారికి ఎవరూ పోటీ లేరు.ఆయనతో పోటీ పడాలంటే కొండతో పొట్టేలు ఢీ కొట్టినట్లు, సింహ రాజును కుందేలు ఎదురించినట్లు ఉంటుంది.ఆయన ఆదర్శంతో ఎన్నో పార్టీలు జాతీయ స్థాయిలో ఉన్నాయి. అదంతా రామారావుగారు పెట్టిన బిక్ష. ఎన్నో రాష్ట్రాల్లో ఆయన ఆలోచన చేసిన పథకాలు అమలు అవుతున్నాయి. యావత్ భారత దేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి నందమూరి తారక రామారావుగారు.... అని బాలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, చరిత్రలో నిలిచిపోయే సందర్భం.విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పరుగాంచి తెలుగుదనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి, తెలుగు తేజాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పి, తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చి, తెలుగు పౌరుషాన్ని దేశ రాజకీయ ముఖ చిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి, ఆ వెలుగు ద్వారా ప్రజలకు అనేక రకాల సందేశాలు, మేలు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంపై సినిమా ప్రారంభం అయిన రోజు, అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు అన్నారు.
Recommended