New ShortCuts Were Introduced To Facebook
  • 6 years ago
List of Facebook Shortcut Keys and Facebook Emoticons

ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మీద తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న సోషల్ మీడియాలో ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం.మౌస్ తో పని లేకుండా మీరు షార్ట్ కట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం బెస్ట్ ట్రిక్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ షార్ట్ కట్స్‌ వాడటం ద్వారా మీరు అత్యంత వేగంగా ఫేస్‌బుక్‌ని వాడేయవచ్చు. అవేంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.
alt + /
కంప్యూటర్ లో ఫేస్‌‌బుక్‌‌ను వాడుతుంటే సెర్చ్ బాక్స్‌‌లో నేరుగా టైప్ చేసేందుకు alt + / షార్ట్ క‌ట్‌‌ను ప్రెస్ చేస్తే చాలు. దాంతో సెర్చ్ బాక్స్ యాక్టివేట్ అవుతుంది. అందులో నేరుగా యూజ‌ర్లు త‌మ‌కు కావ‌ల్సిన స‌మాచారం సెర్చ్ చేసుకోవచ్చు.
ఎవ‌రికైనా మెసేజ్ పంపాల‌నుకుంటే alt + m బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేయాలి. వెంటనే మెసేజ్ లోకి వెళ్లవచ్చు.
హోం పేజీకి చేరుకోవాలంటే alt + 1 ప్రెస్ చేయాలి. మీరు మౌస్ తో ప్రమేయం లేకుండా అక్కడికి నేరుగా వెళ్లవచ్చు.
ప్రొఫైల్ పేజీలోకి వెళ్లాలంటే alt + 2 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దాంతోప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది
ఫ్రెండ్స్ పంపిన రిక్వెస్ట్‌ ల‌ను యాక్సెప్ట్ లేదా డీయాక్సెప్ట్ చేసేందుకు alt + 3 కీల‌ను ప్రెస్ చేయాలి. ఈ కీస్ వాడటం ద్వారా నేరుగా రిక్వెస్ట్ దగ్గరకు వెళుతుంది.
మెసేజ్ పేజీలోకి వెళ్లాలంటే సింపుల్‌ గా alt + 4 కీల‌ను ప్రెస్ చేస్తే స‌రిపోతుంది.
నోటిఫికేష‌న్స్ చూడాలంటే alt + 5 కీల‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు నోటిఫికేషన్ లోకి వెళ్లి ఏం వచ్చాయో తెలుసుకోవచ్చు
ప్రైవ‌సీ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లేందుకు alt + 7 కీల‌ను ప్రెస్ చేయాలి. తద్వారా మీరు మీ ప్రైవసీ సెట్టింగ్స్ ను మార్చుకోవచ్చు.
ఫ్యాన్ పేజీలోకి alt + 8 కీల‌ను ప్రెస్ చేయ‌డం ద్వారా చేరుకోవచ్చు.