Pawan Goes Into Cultivation In Free Time

  • 6 years ago
"I have even seen photos, and short video clippings of Pawan Kalyan working around his farmhouse, practising agriculture. In fact, I was the one who nicknamed him as Thotaramudu. This is a secret that no one knows except our family’, said Nagendra Babu talking to a media channel. " Naga Babu said.

పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. ఆయనకు ఖాళీ సమయం దొరికితే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌కు వెళ్లిపోతారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమా పూర్తయిన వెంటనే తర్వాత సినిమా ఎలాంటిది చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనల్లో మునిగి తేలడం కంటే తోటకు వెళ్లి వ్యవసాయం చేస్తూ గడపటాన్ని ఇష్టపడతారు.
పవన్ కళ్యాణ్ వ్యవహారంపై నాగబాబు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ...ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్, తోటపని, వ్యవసాయం చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే ‘తోటరాముడు' అని ముద్దు పేరుపెట్టాను' అని తెలిపారు.
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివారులో ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు జరుగుతోంది. రసాయనాల అవసరం లేని గోఆధారిత సాగు ఇందులో జరుగుతోంది.
రసాయలు లేకుండా పంట పండిస్తే ఆ రుచే వేరని, చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినపుడు కూరలు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా తన ఫార్మ్ హౌస్ కూరగాయల రుచి ఉంటుందని గతంలో పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విజయరామ్ అనే వ్యక్తితో కలిసి తన వంతు ప్రయత్నం చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తన తోటలో తోట పని చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Recommended