Ball Tampering Controversies that shook the Cricket World
  • 6 years ago
Here is a list of some of the other ball-tampering incidents that have caused major controversies. one of that was Sachin Tendulkar was handed a one-match ban by match referee Mike Denness after he was found guilty of ball tampering during a Test match against South Africa in Port Elizabeth in November, 2001

బాల్‌ టాంపరింగ్‌.. గత మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్‌ను కుదిపేస్తోన్న వివాదాస్పద అంశం. బంతి ఆకారాన్ని అక్రమ మార్గాల ద్వారా ఉద్దేశపూర్వకంగా చెడగొట్టడాన్నే బాల్‌ టాంపరింగ్‌ అంటారు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌ బంతి స్వరూపాన్ని మారుస్తూ కెమెరాకు అడ్డంగా దొరికిపోవడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి చోటుచేసుకోవడం ఇదే తొలిసారా? అంటే కాదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. క్రికెట్లో ఎప్పటి నుంచో నలుగుతున్న మాటిది. జెంటిల్మన్‌ గేమ్‌గా చెప్పుకొనే క్రికెట్‌లో 70వ దశకంలోనే టాంపరింగ్‌ ఆరోపణలు వచ్చాయి.
మ్యాచ్‌లో తమకు విజయావకాశాలు సంక్లిష్టంగా మారినప్పుడు ఆటగాళ్లు ఇలా బంతిని ఏదో రకంగా టాంపరింగ్‌ చేస్తుంటారు. బంతిని గరుకుగా చేయడం ద్వారా రివర్స్‌ స్వింగ్‌కు అనుకూలంగా మారి ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేసేందుకు వీలుచిక్కుతుంది. ఇప్పటిదాకా వెలుగుచూసిన బాల్‌ టాంపరింగ్‌ ఉదంతాలను ఓసారి పరిశీలిస్తే...
భారత్‌తో జరిగిన తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ లేవర్‌ అదనపు స్వింగ్‌ కోసం బంతి స్వరూపాన్ని మార్చినట్టు తొలిసారిగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. భారత్‌ అతడిపై ఫిర్యాదు చేసినా లేవర్‌పై ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఆ టెస్టులో లేవర్‌ పది వికెట్లు తీశాడు.
పాకిస్థాన్‌తో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాళ్లు క్రిస్‌ ప్రింగిల్‌-మార్టిన్‌ క్రో బాటిల్‌ క్యాప్‌తో బంతి ఆకారాన్ని మార్చారు. అయితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకున్నా రిటైర్మెంట్‌ అనంతరం తాము చేసిన టాంపరింగ్‌ను ఈ ఇద్దరూ అంగీకరించడం విశేషం.
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో కెప్టెన్‌ అథర్టన్‌ తన జేబులో నుంచి ఏదో వస్తువును తీసి బంతిని అదేపనిగా రుద్దాడు. అయితే తాను బంతిపై ఉన్న మట్టిని తుడిచానంటూ టాంపరింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చాడు. తన చేతులు గరుకుగా ఉంచుకునేందుకే ఇలా చేసినట్లు ఆ తర్వాత అథర్టన్‌ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ బాల్ టాంపరింగ్ వివాదంలో అతడు 2వేల పౌండ్లు జరిమానాగా చెల్లించాడు.
Recommended