Ranveer Singh And Deepika Padukone Following Virat & Anushka
  • 6 years ago
After the grand wedding of Anushka Sharma and Virat Kohli, fans have been waiting to see Ranveer Singh and Deepika Padukone married. And if recent reports are to be believed, Deepika Padukone has already started shopping for her wedding.

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ కొన్ని రోజులుగా ప్రేమలో మునిగితేలుతున్నారు. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లి త్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది. తన సొంత నగరమైన బెంగుళూరు వచ్చిన దీపిక ఇటీవల తన తల్లితో కలిసి భారీ ఎత్తున వెడ్డింగ్ జ్యువెల్లరీ కొనుగోలు చేసిందట. దీంతో త్వరలోనే దీపిక వివాహం ఉండబోతోందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
దీపిక పదుకోన్ ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు. అయితే ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధిభారిన పడి లండన్లో చికిత్స తీసుకుంటుండటంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో ఖాళీగా ఉన్న దీపిక పదుకోన్.... పెళ్లి షాపింగ్ ప్రారంభించిందని టాక్.
ఈ రోజుల్లో పెళ్లి తంతులో అతిపెద్ద పని అంటే వెడ్డింగ్ షాపింగ్. తన బిజీ షెడ్యూల్ వల్ల తర్వాత సమయం ఉంటుందో? లేదో? అని భావించిన దీపిక ఇలా పెళ్లికి సంబంధించిన పనులు పూర్తి చేసే పనిలో పడింది.బెంగుళూరులోని ప్రముఖ నగల దుకాణాలను తన తల్లి, చెల్లి అనిషా పదుకోన్‌తో కలిసి దీపిక సందర్శించి భారీ ఎత్తున కోనుగోళ్లు జరిపారట.
వీరి పెళ్లి కూడా ప్రైవేట్ సెర్మనీగా రహస్యంగా జరిగే అవకాశం ఉందని, కోహ్లి-అనుష్క వివాహం తరహాలోనే.... పెళ్లి తర్వాత ఫోటోలు విడుదల చేసి మీడియాకు విషయం తెలియజేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
కొన్ని రోజుల క్రితం దీపిక పేరెంట్స్ ముంబై వచ్చారు. అక్కడే రణవీర్ కుటుంబ సభ్యులతో కలిసి వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడు అనే విషయం ఇంకా బయటకు రాలేదు.
Recommended