South Africa vs Australia : David Warner Confronted by Fan
  • 6 years ago
A man appeared to continue making comments as Warner walked up the stairs toward the Australia dressing room.

ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా గురువారం మూడో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిరిస్ ఏ ముహుర్తాన ప్రారంభం అయిందో ఏమో తెలియదు గానీ, ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి.
డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో డ్రెస్సింగ్ రూమ్ మెట్ల వద్ద డేవిడ్ వార్నర్-సఫారీ వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్‌ల మధ్య మాటల యుద్ధం జరగడం వీరిద్దరిపై ఐసీసీ చర్యలు తీసుకోవడాన్ని మనం చూశాం. ఆ తర్వాత పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ల మధ్య గొడవ చేసుకుంది.
ఈ క్రమంలో గత రెండు టెస్టుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో రబాడను చూడగానే డేవిడ్ వార్నర్‌కు ఎక్కడలేని కసి వచ్చినట్లుంది.
మూడో టెస్టులో రబాడ బౌలింగ్‌లో వరుసగా ఐదు బౌండరీలు బాదాడు. ఒక ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, మరో ఓవర్ తొలి రెండు బంతుల్లో ఒకటి సిక్స్, ఒక ఫోర్ బాదాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో చివరి మూడు బంతుల్ని బౌండరీలకు తరలించిన వార్నర్.. ఆరో ఓవర్లోనూ మొదటి బంతికి సిక్స్ బాదాడు.
దీంతో రబాడ లయ తప్పి మరుసటి బంతిని నోబాల్ వేయగా.. దాన్ని వార్నర్ ఫోరుగా మలిచాడు. ఐదు బంతుల్లోనే 22 పరుగులు పిండుకున్నాడు. కానీ మరుసటి బంతికే వార్నర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రబాడ పగతీర్చుకున్నాడు. టెస్టు మ్యాచ్‌ని టీ20గా మార్చిన వార్నర్ 14 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.
Recommended