IPL 2018: Sunrisers Hyderabad Start Ticket Selling Process

  • 6 years ago
Sunrisers Hyderabad will play 7 games at their home ground Rajiv Gandhi worldwide stadium, Hyderabad. They may face Rajasthan Royals within the first sport at house on April 9

హైదరాబాద్ వాసులకు శుభవార్త. నగరంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడు కొనుగోలు చేయాలని ఎదురుచూస్తోన్న అభిమానులు ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్‌ అమ్మకాలను శుక్రవారం ప్రారంభించింది.
ఈ విషయాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌ల కోసం టిక్కెట్లు కావాల్సిన వారు sunrisershyderabad.in వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్‌ 9 నుంచి మే 19 వరకు జరిగే మొత్తం 7 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్లను ఈ సైట్‌లో అందుబాటులో ఉంచారు.
అంతేకాదు టికెట్లను కొనుగోలు చేసే అభిమానుల కోసం 5, 10 శాతం డిస్కౌంట్‌తో ప్రాంఛైజీ ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్లతో అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాగా, టిక్కెట్‌ ధరలను ఆరు కేటగిరీలగా విభజించారు.
రూ.500, రూ.781.25, రూ. 976.56, రూ.1,171.88, రూ.2,734.38, రూ.3,906.25 ధరలతో టిక్కెట్లను అందుబాటులో ఉన్నాయి. నగరంలోని 15 ఔట్‌లెట్ల ద్వారా సన్ రైజర్స్‌కు చెందిన మ్యాచ్ టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై హైదరాబాద్‌ ఏప్రిల్‌ 9న రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

Recommended