అల్లు అర్జున్ తో అద్భుతమైన అనుభవం అంటున్న ఎల్లి...!

  • 6 years ago
Elli Avram in Allu Arjun’s film. Performed in special song

బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఎల్లి అవ్రం తన అందాలతో ఎప్పటికప్పుడు యువతని హీటెక్కిస్తూనే ఉంటుంది. తొలిసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఎల్లి డాన్సులకు అల్లు అర్జున్ తో నాపేరు సూర్య చిత్రం చేస్తున్న దర్శకుడు వక్కంతం వంశి ఫిదా అయ్యాడట. నా పేరు సూర్య చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం వక్కంతం వంశి ఎల్లి సంప్రదించడం, ఆమె ఒకే చెప్పడం, స్పెషల్ సాంగ్ షూట్ కూడా పూర్తికావడం సైలెంట్ గా జరిగిపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఎల్లి బన్నీపై ప్రశంసలు కురిపించింది.
అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టారో నాకు తెలుసు. ఆయన చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం అడిగినప్పుడు తాను ఇంకేం మాట్లాడకుండా ఒకే చెప్పేశానని ఎల్లి తెలిపింది. బన్నీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం అద్భుతమైన అనుభవం అని ఎల్లి తెలిపింది
ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ స్లోగా సాగుతుందని, జానపదగేయం తరహాలో ఉంటుందని తెలిపింది. అల్లు అర్జున్ అమేజింగ్ డాన్సర్ అంటూ కితాబిచ్చింది. అల్లు అర్జున్ కు తాను పెద్ద అభిమానిని అని తెలిపింది. కానీ ఈ చిత్రంలో తనతో అల్లుఅర్జున్ డాన్స్ ఉండదని, తనది సోలో పర్ఫామెన్స్ అని చెబుతోంది.
హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొనడం తనకు ఇది రెండవ సారి అని ఎల్లి తెలిపింది. హైదరాబాద్ వాతావరణం చాలా బాగుందంటూ పేర్కొంది.
నాపేరు సూర్య చిత్రం వలన తాను కొన్ని తెలుగు పదాలు నేర్చుకోగలిగానని ఎల్లి తెలిపింది. తెలుగు స్లాంగ్ చాలా ప్రత్యేకమైనదని ఎల్లి అభిప్రాయపడింది. కళ్ళు, మంచి, బాగున్నారా వంటి పదాలు తెలుసుకున్నానని ఎల్లి మురిసిపోతోంది.
ఇల్లి అవ్రం కు సినిమాలు మాత్రమే కాక ఇతర వ్యవహారాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ స్వీడన్ బ్యూటీ సెక్సీ చూపులకు టీం ఇండియా అల్ రౌండర్ హార్థిక్ పాండ్య క్లీన్ బౌల్డ్ అయినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Recommended