India vs Bangladesh : Dinesh Karthik's Last Ball Six & Stunning Innings
  • 6 years ago
Dinesh Karthik's last-ball six as India pulled off an incredible chase beating Bangladesh by four wickets in the Nidhas T20 Tri-series final, in Colombo on Sunday.Dinesh Karthik came at the start of the 19th over and hit Rubel Hossain for 22 including two sixes and two fours to bring down the equation to 12 off the final over before finishing it off in style.

నిదహాస్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దినేశ్‌ కార్తీక్‌ చేసిన మాయ మర్చిపోలేనిది ..! 6, 4, 6, 0, 2, 4... తానెదుర్కొన్న తొలి ఆరు బంతుల్లో దినేశ్‌ కార్తీక్‌ ఆట తీరిది..! 12 బంతుల్లో 34 పరుగులు కావాల్సిన దశలో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. (8 బంతుల్లో 29 నాటౌట్‌) దినేశ్‌ కార్తీక్‌ హీరోచిత బ్యాటింగ్‌తో నిదహాస్‌ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.
దినేశ్‌ కార్తీక్‌ను కాదని యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌కు ముందుగా బ్యాటింగ్‌ ఇవ్వడం భారత్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చిన శంకర్‌ ఈ స్థాయి ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. బాల్స్ ని తింటూ బౌండ్రీల మాట దేవుడెరుగు.. కనీసం సింగిల్‌ తీసే ఆత్మవిశ్వాసం కూడా విజయ్‌లో కనిపించడం లేదు. సరిగ్గా ఆ సమయంలో ధోనీని తలపించే ఆటతో చెలరేగిన దినేశ్‌ కార్తీక్‌ ఆఖరి బంతికి సిక్సర్‌తో కూల్‌గా మ్యాచ్‌ను గెలిపించి హీరోగా మారాడు..!
కాగా ఆరు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన సమయంలో వైడ్‌తో ఆరంభమైన ఆ ఓవర్లో తొలి బంతిని శంకర్‌ ఆడలేకపోయాడు. రెండో బాల్‌కు ఎలాగోలా సింగిల్‌ తీశాడు. అయితే, మూడో బంతికి దినేశ్‌ కూడా సింగిల్‌ తీయడంతో మళ్లీ శంకర్‌కే బ్యాటింగ్‌. 3 బంతుల్లో 11 పరుగులు కావాలిక. ఈ దశలో నాలుగో బంతిని థర్డ్‌మ్యాన్‌ మీదుగా బౌండ్రీ కొట్టిన శంకర్‌.. ఐదో బాల్‌కు పెవిలియన్ చేరాడు. మిగిలింది ఒక్క బంతే. కావాల్సింది ఐదు పరుగులు. సిక్సర్‌ కొడితే గెలుపు. ఫోర్‌ రాబట్టినా టై చేసుకోవచ్చు. అంతటి ఉత్కంఠలోనూ ప్రశాంతంగా ఉన్న దినేశ్‌.. ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా ఫ్లాట్‌ సిక్సర్‌ కొట్టడంతో.. భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకపోయింది. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ చేజారడంతో బంగ్లా ఏడ్చినంత పని చేసింది.
బంగ్లా ఆశలను చిదిమేస్తూ.. టీమిండియాకు అవమానాన్ని తప్పిస్తూ.. టీమిండియా అభిమానులకు నిదహాస్‌ ట్రోఫీని ఉగాది కానుకగా ఇచ్చాడు..! అంతేకాదు శ్రీలంక అభిమాను లు సైతం మనమే గెలవాలని గట్టిగా కోరుకున్న నేపధ్యంలో బంగ్లా నాగిని డాన్స్ కు కౌంటర్ ఇచ్చాడు దినేశ్‌ కార్తీక్‌.
Recommended