కావేరీ విషయంలో మాకు మద్దతు తెలుపలేదు : టిడిపి, వైసిపి కి షాక్
  • 6 years ago
AIADMK will not support the no-confidence motion against BJP Government at the Centre being brought by TDP and YSRCP.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, శివసేన, టీఆర్ఎస్‌లు టీడీపీకి తమ మద్దతు ప్రకటించాయి. అయితే ఇరవై నాలుగు గంటలకు కూడా గడవకుండానే అన్నాయడియంకె మాట మార్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో తమకేమీ సంబంధం లేదని, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని లోకసభలో అన్నాడియంకె పక్ష నేత పి. వేణుగోపాల్ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. అన్నాడియంకెకు 37 మంది లోకసభ సభ్యులున్నారు.తమను వైసిపి నాయకులు సంప్రదించారని, అయితే తాము మద్దతు ఇవ్వబోమని చెప్పానని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యాన్ని తాము నిరసించినప్పుడు టిడిపి గానీ వైసిపి గానీ మద్దతు తెలుపలేదని ఆయన గుర్తు చేశారు. తాము కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వని పార్టీలకు తాము ఇప్పుడు ఎందుకు మద్దతు ఇవ్వాలని ఆయన అడిగారు. రాజకీయ కారణాలతో టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తోందని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి. జయకుమార్ విమర్శించారు. నాలుగేళ్ల పాటు టిడిపి బిజెపితో ఉదని, అకస్మాత్తుగా బయటకు వచ్చి అవిశ్వాసం గురింంచి మాట్లాడుతోందని అన్నారు.
Recommended