వైసీపీ అవిశ్వాసానికి టీడీపీ మద్దతు? జగన్ ను మళ్ళి ఇరికించిన బాబు
  • 6 years ago
Tdp decided to support ysrcp no cofidence motion on union government . Tdp chief Chandrababu Naidu conducted meeting with ministers and senior mlas on Thursday at Amaravathi.

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని టిడిపి నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే కేంద్రంపై వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాసానికి మద్దతివ్వాలని నిర్ణయం తీసుకొంది.
ఏఫీ సీఎం చంద్రబాబునాయుడు గురువారం నాడు అమరావతిలో మంత్రులతో సుధీర్ఘంగా మంతనాలు నిర్వహించారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో చర్చించారు. ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఇతర త్రా వ్యవహరాలపై చంద్రబాబునాయుడు చర్చించారు. రాష్ట్రంలో చోటతు చేసుకొన్న వేగంగా మార్పులు చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై కూడ బాబు చర్చించారు.
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ మార్చి 16న, అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబునాయుడు మంత్రులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ గురువారం నాడు అవిశ్వాస నోటీసును ఇచ్చింది. 198 కింద నోటీసును ఇచ్చింది. శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఈ విషయమై చర్చకు వస్తోందో లేదా అనేది చూడాలి.
అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం లేనే లేదని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాసంలో ఏపీకి చెందిన టిడిపి, వైసీపీ నేతలు ఏకమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
Recommended