Third Front : Support pours in for KCR but here the Other Side

  • 6 years ago
Third Front, Telangana chief minister K Chandrasekhar Rao pitched for an alternative for the Congress and the BJP while advocating a Constitutional change to empower states more. West Bengal chief minister Mamatha Benerjee, All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) party president and Hyderabad MP Asasuddin Owaisi, Jarkhand former CM Hemanth Soren, Jana Sena party chief Pawan Kalyan and others welcomed his proposal and pledged their support.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. సాధ్యాసాధ్యాలపై చర్చలు కూడా సాగుతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ హఠాత్తుగా థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడటం వెనుక కారణాలు ఏమిటనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణంతో పాటు ఎన్నో అంశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని, పార్టీ ఎంపీలను గెలిపించుకోవడం మొదలు.. ఢిల్లీలో చక్రం తిప్పాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని భావిస్తున్నారు. అయితే, కేసీఆర్ సోమవారం మరో అడుగు ముందుకేశారు. జాతీయస్థాయిలో పలువురితో భేటీ కావాలని నిర్ణయించారు.

కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే ఆయనకు ప్రధాని కావాలనే కోరిక ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధాని మాట ఏమిటో గానీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చాలినన్ని సీట్లు రావని, తెలంగాణలో సాధ్యమైనన్ని ఎక్కువ లోకసభ స్థానాలు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయేలో చేరి ఢిల్లీలో చక్రం తిప్పవచ్చుననే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు పలు ఫ్రంట్‌లు వచ్చి విఫలమయ్యాయి. ఈ విషయం కేసీఆర్‌కు తెలుసునని, ఆయన ప్రధాన ఉద్దేశ్యం 2019 తర్వాత ఎన్డీయేలో చేరి చక్రం తిప్పడమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

Recommended