Sridevi Case Closed But Many Unanswered Questions Here ?

  • 6 years ago
Unanswered questions on Sridevi case. Talking about the cause of Sridevi's lost life, many on social media have been saying that she did not die due to drowning in bathtub. The Dubai Police have cleared the release of Bollywood icon Sridevi’s body for the embalming process. The Dubai Public Service has also closed the investigation into the actor's case.

నటి శ్రీదేవి మృతి కేసును క్లోజ్ చేసినట్లు దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మంగళవారం వెల్లడించింది. మృతదేహానికి ఎంబామింగ్ పూర్తయింది. బంధువులు, భారత్ అధికారులకు అప్పగించారు. దుబాయ్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వస్తుంది.
ప్రత్యేక విమానంలో ముంబై తీసుకు వస్తున్నారు. పోలీసులు, ఫోరెన్సిక్ రిపోర్టులలో ఎలాంటి తేడా లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయినట్లు వెల్లడించారు.
ఆమెకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత వైద్యులు చేసిన పరీక్షల్లో ఆమె ప్రమాదవశాత్తు నీటిలో పడి ఊపిరాడక చనిపోయారని తేల్చారు. ఆమె దేహంలో అల్కాహాల్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయని, బహుశా స్నానానికి వెళ్లిన ఆమె పట్టును కోల్పోయి కాలు జారి టబ్‌లో పడి ఉంటారని చెప్పారు.అయితే శ్రీదేవి మరణంపై సమాధానం లేని ప్రశ్నలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోవడం వల్ల మరణించింది అని ఉంది. బాత్ టబ్‌లో పడిపోయినపుడు బలమైన గాయం అయితే తప్ప మరణించే అవకాశం లేదు. అయితే ఆమె శరీరం మీద చిన్న స్క్రాచ్ కూడా లేక పోవడంతో అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆల్రెడీ శ్రీదేవి ఇండియాకు తిరిగి వద్దామని రెడీ అవుతుండగా బోనీ కపూర్ సర్‌ప్రైజ్ చేయడానికి మళ్లీ దుబాయ్ ఎందుకు వెళ్లినట్లు? అనే ప్రశ్నకు సమాధానం లేదు
శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉంది. అయితే ఆమెకు మధ్యం అలవాటు లేదని, అప్పుడప్పుడు వైన్ మాత్రం తాగుతుందని సన్నిహితులు అంటున్నారు. మరి ఆమె బాడీలోకి ఆల్కహాల్ ఎలా వచ్చింది? అనే దానికి సమాధానం లేదు. శ్రీదేవి హార్డ్ డ్రింక్ సేవించరని, ఆమె వైన్ లాంటి లైట్ డ్రింక్ మాత్రమే సేవిస్తారని అంటున్నారు. దీంతో ఆ రోజు రాత్రి శ్రీదేవికి ఎవరైనా బలవంతంగా మద్యం తాగించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended